Rajamouli Nani Movie : రాజమౌళి దర్శకత్వంలో నాని సినిమా.. జక్కన్నని రిక్వెస్ట్ చేస్తున్న నాని..?

ఈగ మూవీ తర్వాత రాజమౌళి బాహుబలి(Bahubali) వంటి బంపర్ హిట్ సినిమా తీశారు. ఆ తర్వాత ట్రిపుల్ ఆర్(RRR) కూడా ప్రాణం పోశారు. ఇప్పుడు మహేశ్‌బాబు(Mahesh Babu)తో మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు.

Rajamouli Nani Movie : రాజమౌళి దర్శకత్వంలో నాని సినిమా.. జక్కన్నని రిక్వెస్ట్ చేస్తున్న నాని..?

Nani Movie Under Rajamouli Direction after Mahesh Babu Movie Rumours goes Viral

Rajamouli Nani Movie : ఇప్పటికే జక్కన్న తెరకెక్కించిన ఈగ(Eega) చిత్రంతో బంపర్ హిట్ కొట్టిన నాని సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రాజమౌళితో సినిమా చేయాలని కోరుకుంటున్నాడట. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్న జక్కన్న తనకు సమయం కేటాయించాలని కోరుకుంటున్నాడట నాని. జక్కన్న ఓకే చేస్తే ఈ ఇద్దరి కాంబోలో త్వరలో ఈగ లాంటి మరో సూపర్ డూపర్ సినిమా సెట్స్‌పైకి వస్తుందంటున్నారు.

న్యాచురల్ స్టార్ నాని.. హిట్ చిత్రాల దర్శకుడు రాజమౌళితో మరో సినిమా చేయాలని కోరుకుంటున్నాడు. ఈగ చిత్రం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రావాలని సినీ ప్రియులంతా కోరుకున్నారు. కానీ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న దర్శక ధీరుడికే కుదరట్లేదు. నాని మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా రాజమౌళి సినిమా కోసం ప్రయత్నిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈగ సినిమాతో టాలీవుడ్‌లో మంచి ఇమేజ్ సంపాదించిన నాని జక్కన్నతో అప్పటి నుంచి మంచి స్నేహ సంబంధాలే కొనసాగిస్తున్నాడు. మధ్యలో తన మజ్ను(Majnu) సినిమాలో రాజమౌళితో గెస్ట్ అప్పీరెన్స్ కూడా చేయించాడు. సుదీర్ఘ విరామం తర్వాతైనా జక్కన్న సినిమాలో నటించాలని ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. రాజమౌళి కూడా ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాలు తీస్తుండటంతో నాని కోసం ఏదైనా పాత్ర సృష్టిస్తాడా అనే చర్చ జరిగింది.

ఈగ మూవీ తర్వాత రాజమౌళి బాహుబలి(Bahubali) వంటి బంపర్ హిట్ సినిమా తీశారు. ఆ తర్వాత ట్రిపుల్ ఆర్(RRR) కూడా ప్రాణం పోశారు. ఇప్పుడు మహేశ్‌బాబు(Mahesh Babu)తో మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో నానికి చాన్స్ ఉంటుందని అనుకున్నారు. కానీ అది ఉట్టి ప్రచారమే అని తేలిపోయింది. ఇదే సమయంలో నాని కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదు. అయితే ఇప్పుడు మహేశ్ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత తన కోసం ఓ సినిమా తీయాలని జక్కన్నను కోరుతున్నాడు నాని. ఈగ లాంటి ప్రయోగాత్మక చిత్రం అయినా సరే చేసేందుకు రెడీగా ఉన్నట్లు చెబుతున్నాడట. నాని ప్రపోజల్‌కు జక్కన్న అంగీకరిస్తే త్వరలో మరో హిట్ మూవీ తెరకెక్కడం ఖాయమంటున్నారు సినీ పరిశీలకులు.

Jailer Collections : అదరగొడుతున్న రజినీకాంత్ జైలర్ కలెక్షన్స్.. వామ్మో రెండు రోజుల్లోనే ఇంతా..

కానీ మహేష్ సినిమా పూర్తవ్వాలంటే ఇంకో మూడేళ్లు అయినా పడుతుంది. ఇటీవల నాని రాజమౌళి ఫ్యామిలీ సినిమాల ఈవెంట్స్ కి వెళ్తున్నాడు. తన సినిమాలకు రాజమౌళిని పిలుస్తున్నాడు. ఇలా రాజమౌళితో మాత్రం కాంటాక్ట్ అస్సలు మిస్ అవ్వకుండా చూసుకుంటున్నాడు. మహేష్ సినిమా తర్వాత రాజమౌళి ఇంకా ఏ సినిమా ప్రకటించలేదు కాబట్టి ఈ లోపు నాని రాజమౌళితో సినిమా ఓకే చేయించుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. చూడాలి మరి వీరిద్దరి కాంబోలో మరో సినిమా అవస్తుందో రాదో.