Nani, Chaitu – Vijay : ఒక ప్రాపర్ కమర్షియల్ బొమ్మ కనుక పడితే..

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ భలే గమ్మత్తుగా అనిపిస్తుంటాయి.. వర్కౌట్ అవుతాయా లేదా అనేది పక్కన పెడితే వినడానికి, చదవడానికి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంటాయి..

Nani, Chaitu – Vijay : ఒక ప్రాపర్ కమర్షియల్ బొమ్మ కనుక పడితే..

Nani, Chaitu – Vijay

Nani, Chaitu – Vijay: సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ భలే గమ్మత్తుగా అనిపిస్తుంటాయి. వర్కౌట్ అవుతాయా లేదా అనేది పక్కన పెడితే.. వినడానికి, చదవడానికి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంటాయి. అలాగే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే క్రేజీ కాంబోస్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మల్టీస్టారర్ ప్లస్ సోలో హీరోలుగా స్టామినా చూపించడానికి ఈ ముగ్గురు హీరోలకు ‘ఒక ప్రాపర్ కమర్షియల్ బొమ్మ కనుక పడితే..’ అంటూ నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. వాళ్లెవరో చూద్దాం..

Liger

 

నేచురల్ స్టార్ నాని, యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, రౌడీ హీరో విజయ్ దేవరకొండ .. వీళ్ళు ముగ్గురూ కూడా సినిమా సినిమాకి కథ, క్యారెక్టర్ పరంగా వేరియేషన్ చూపిస్తూ.. ఎవరికివారు ఓన్ ఐడెంటిటీ తెచ్చుకున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ ‘లైగర్’ మూవీతో పాన్ ఇండియా స్థాయికి వెళ్లబోతున్నాడు.

Laal Singh Chaddha

 

నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది.. ‘థ్యాంక్యూ’ మూవీ కూడా విడుదలకు రెడీ అవుతోంది. ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ తో చైతు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీలో మిలటరీ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సీన్స్‌లో ఆమిర్ ప్రాణ స్నేహితుడిగా కనిపించనున్నాడు చై. ఈ సిినిమాలో క్యారెక్టర్ కోసం మస్కులర్ బాడీలో కనిపించడానికి కొత్తగా మేకోవర్ అయ్యాడు యువసామ్రాట్.

Nani

 

‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే… సుందరానికీ!’ ఇలా వరుస సినిమాలు చేస్తూ.. థియేటర్లు రీ ఓపెన్ అనగానే.. వన్ బై వన్ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చెయ్యడానికి రెడీగా ఉన్నాడు నేచురల్ స్టార్ నాని.. నటుడిగా బిజీగా ఉంటూనే ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ మీద కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు నిర్మిస్తూ ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌గా కంటిన్యూ అవుతున్నాడు. ఈ ముగ్గురు హీరోలకి ఒక ప్రాపర్ కమర్షియల్ బొమ్మ కనుక పడితే.. ఇప్పుడున్న పొజిషిన్ నుండి బిగ్గెర్ స్టార్ రేంజ్‌కి వెళ్తారు.. త్వరలో రాబోయే అప్‌కమింగ్ మూవీస్‌తో ఈ ఫీట్ సాధిస్తారు అనే అంచనాలతో ఉన్నారు చై, నాని అండ్ విజయ్ ఫ్యాన్స్.