Nani : ఆయనకి చిరంజీవి.. మాకు రవితేజ.. ప్రతి జనరేషన్‌కి ఒకడు ఉంటాడు..

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ.. ''రవి అన్న కోసం మాట్లాడే అవకాశం వచ్చిందని ఇక్కడకి వచ్చాను. రవి అన్నకి చిరంజీవి గారు అంటే ఇష్టం, రవి అన్న కెరీర్ స్టార్ట్ అయినప్పుడు వాళ్లకు చిరంజీవి గారు ఇన్స్పిరేషన్. నాకు నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు.....................

Nani : ఆయనకి చిరంజీవి.. మాకు రవితేజ.. ప్రతి జనరేషన్‌కి ఒకడు ఉంటాడు..

Nani

Raviteja :  రవితేజ హీరోగా రాబోతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 24 ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా న్యాచురల్ స్టార్ నాని వచ్చారు.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ.. ”రవి అన్న కోసం మాట్లాడే అవకాశం వచ్చిందని ఇక్కడకి వచ్చాను. రవి అన్నకి చిరంజీవి గారు అంటే ఇష్టం, రవి అన్న కెరీర్ స్టార్ట్ అయినప్పుడు వాళ్లకు చిరంజీవి గారు ఇన్స్పిరేషన్. నాకు నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు రవితేజ అన్న ఇన్స్పిరేషన్. ప్రతి జనరేషన్ కి ఇలా ఒకడు ఉంటాడు. ఈ జనరేషన్ కి రవి అన్న అలాంటోడు. చిరంజీవి సినిమాలో రవితేజ చేస్తున్నట్టు మేము కూడా రవి అన్నతో చేయాలి. నాకు రవి అన్నతో సినిమా చేయాలని ఉంది. ఒక మంచి సినిమా చూసినప్పుడు ఆ టీమ్ ను అభినందించడం ఒక బాధ్యత గా ఫీల్ అవుతారు రవి అన్న.”

Chiranjeevi On Directors : టాలీవుడ్ డైరెక్టర్లపై చిరంజీవి సీరియస్… పద్దతి మార్చుకోవాలని హితవు

”రామారావు అన్ డ్యూటీ సినిమా పై ఫస్ట్ నుంచి ఒక పాజిటివ్ వైబ్ ఉంది. నా దసరా సినిమా నిర్మాతలే ఈ సినిమాని నిర్మించారు. బాక్సాఫీస్ కి సినిమానే కాదు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అందించాలని మా నిర్మాతల తాపత్రయం. వేణు గారి సెకెండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా ఉండాలి. రామారావు అన్ డ్యూటీ టీమ్ అందరికీ అల్ ది బెస్ట్. 20 సంవత్సరాల నుంచి రవితేజ అన్ డ్యూటీ 29 నుంచి రామారావు అన్ డ్యూటీ” అని తెలిపారు. ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్లు నాని, రవితేజ ఒకేసారి స్టేజిపై కనపడటంతో అభిమానులు, ప్రేక్షకుల ఆనందానికి హద్దులు లేవు.