Nawazuddin Siddiqui : నేను సౌత్ సినిమాలు చూడలేదు.. బాలీవుడ్ లో ఒక్క హిట్ పడితే అంతా సెట్ అయిపోద్ది..

బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..''ఇప్పటి వరకు నేను ఏ సౌత్ సినిమాలు చూడలేదు. సౌత్‌ సినిమాలనే కాదు, కమర్షియల్‌............

Nawazuddin Siddiqui : నేను సౌత్ సినిమాలు చూడలేదు.. బాలీవుడ్ లో ఒక్క హిట్ పడితే అంతా సెట్ అయిపోద్ది..

Nawazuddin

 

Nawazuddin Siddiqui :  ఇటీవల సౌత్ సినిమాలు దేశమంతటా, ముఖ్యంగా బాలీవుడ్ లో భారీ విజయాన్ని సాధిస్తున్న సంగతి తెలిసిందే. భారీ విజయమే కాక కలెక్షన్లు కూడా భారీగానే సాధిస్తున్నాయి. సౌత్ సినిమాల సక్సెస్ పై ఇప్పటికే బాలీవుడ్ కుళ్ళుకుంటుంది. కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు సౌత్ సినిమాలకి సపోర్ట్ ఇచ్చి వాటిలో నటించాలని కోరుకుంటుంటే మరికొంతమంది కావాలని సౌత్ సినిమాలపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాలపై కామెంట్స్ చేయగా తాజాగా మరో నటుడు సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 

బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”ఇప్పటి వరకు నేను ఏ సౌత్ సినిమాలు చూడలేదు. సౌత్‌ సినిమాలనే కాదు, కమర్షియల్‌ సినిమాలంటే నాకు పెద్దగా ఆసక్తి ఉండదు. అందుకే అలాంటి సినిమాలు చూడను. సినిమాలు చూసేంత ఖాళీ ప్రస్తుతం నాకు లేదు కాబట్టి నేను సౌత్ సినిమాల సక్సెస్‌పై మాట్లాడలేను. అయినా ఒక సినిమా హిట్‌ అయితే అంతా కలిసి దాన్ని పైకి లేపడం, కలెక్షన్స్‌ రాకుంటే వెంటనే విమర్శలు చేయడం ఇప్పుడు సాధారణమైంది. బాలీవుడ్‌కు ఒక్క బ్లాక్‌బస్టర్‌ పడితే అంతా సెట్ అయిపోతుంది” అని అన్నారు.

Vishwaksen : మూడేళ్లు ప్రేమించా.. వదిలేసి వెళ్ళిపోయింది.. లవ్ బ్రేకప్ ని బయటపెట్టిన యువ హీరో

”లాక్‌డౌన్‌లో ఖాళీగా ఉండి అంతర్జాతీయ సినిమాలు చూడటం వల్ల చూసిన ప్రేక్షకుడి అభిరుచిలో మార్పు వస్తుందని నేను ముందుగానే ఊహించాను. కానీ ఈ మార్పు మరీ అంత మంచిది కాదు. ప్రస్తుతం ప్రేక్షకులు మసాలా కంటెంట్‌తో వస్తున్న సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. మేము కూడా కమర్షియల్‌ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము, అవి కూడా భారీ వసూళ్లు సాధిస్తాయి”అని తెలిపారు.