Nayan-Vignesh : నయన్ పెళ్ళికి షారుఖ్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

చెన్నైలో జరిగిన వీరి పెళ్ళికి రజినీకాంత్, కార్తీ, విజయ్ సేతుపతి, అజిత్, బోనికపూర్, షారుఖ్, అట్లీ.. ఇలా పలువురు సౌత్, నార్త్ సెలబ్రిటీలు విచ్చేశారు. చాలా మంది సెలబ్రిటీలు వీరి వివాహానికి విచ్చేసి......................

Nayan-Vignesh : నయన్ పెళ్ళికి షారుఖ్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Shahrukh Khan

Shahrukh Khan :  గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయనతార, విగ్నేష్ శివన్ తాజాగా జూన్ 9న చెన్నైలోని ఓ ప్రైవేట్ హోటల్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత డైరెక్ట్ గా తిరుమలకి వెళ్లి స్వామి వారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇక వీరిద్దరి పెళ్ళికి నెటిజన్లు, సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

చెన్నైలో జరిగిన వీరి పెళ్ళికి రజినీకాంత్, కార్తీ, విజయ్ సేతుపతి, అజిత్, బోనికపూర్, షారుఖ్, అట్లీ.. ఇలా పలువురు సౌత్, నార్త్ సెలబ్రిటీలు విచ్చేశారు. చాలా మంది సెలబ్రిటీలు వీరి వివాహానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలియచేశారు. అయితే ఈ పెళ్ళికి షారుఖ్ ఖాన్ రావడంతో జనాలు షారుఖ్ ని ట్రోల్ చేస్తున్నారు.

Nayan-Vignesh : నయన్-విగ్నేష్ ఎంత గొప్ప మనసో.. పెళ్ళికి లక్షమంది ఆనాధలు, వృద్ధులు, పేదలకు భోజనాలు..

ఎందుకంటే ఇటీవలే షారుఖ్ కి కరోనా వచ్చింది. బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ తన బర్త్ డే పార్టీ గ్రాండ్ గా ఇవ్వడంతో ఆ పార్టీకి వచ్చిన వారిలో దాదాపు 50 మందికి కరోనా సోకింది. అందులో షారుఖ్ కూడా ఉన్నారు. అయితే కరోనా వారం రోజుల్లోనే తగ్గగానే షారుఖ్ ఈ పెళ్ళికి వచ్చేశారు. దీంతో నయన్ ఫ్యాన్స్, నెటిజన్లు కరోనా తగ్గి కనీసం మూడు, నాలుగు రోజులు కూడా అవ్వలేదు అప్పుడే బయటకి ఎలా వస్తారు? ఇంతమంది సెలబ్రిటీలు వచ్చే పెళ్ళికి ఎలా వస్తారు అని షారుఖ్ ని ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ కోపానికి కూడా అర్ధం ఉంది కానీ షారుఖ్ కరోనా పూర్తిగా తగ్గిపోయిందని ధీమాతోనే ఈ పెళ్ళికి వచ్చినట్టు తెలుస్తుంది.