Shehnaaz Gill : బాయ్‌ఫ్రెండ్ చనిపోయి సంవత్సరం కూడా కాలేదు.. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయిందంటూ ట్రోల్స్..

బాలీవుడ్ ప్రముఖ సింగర్, నటి షెహనాజ్ గిల్ తాజాగా జరిగిన రంజాన్ పార్టీలో సల్మాన్ ఖాన్ ని కౌగలించుకొని, ముద్దులు పెట్టడంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు అంతా షెహనాజ్ ని ట్రోల్................

Shehnaaz Gill : బాయ్‌ఫ్రెండ్ చనిపోయి సంవత్సరం కూడా కాలేదు.. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయిందంటూ ట్రోల్స్..

Shehnaaz Gill

 

Salman Khan :  బాలీవుడ్ ప్రముఖ సింగర్, నటి షెహనాజ్ గిల్ తాజాగా జరిగిన రంజాన్ పార్టీలో సల్మాన్ ఖాన్ ని కౌగలించుకొని, ముద్దులు పెట్టడంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు అంతా షెహనాజ్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల రంజాన్ సందర్భంగా సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ ఈద్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీకి బాలీవుడ్‌ ప్రముఖులంతా తరలిరాగా బిగ్‌బాస్‌ బ్యూటీ, నటి, సింగర్‌ షెహనాజ్‌​ గిల్‌ కూడా హాజరైంది.

 

అయితే ఈ భామ పార్టీలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ పార్టీకి సల్మాన్ ఖాన్‌ కూడా హాజరవ్వడంతో ఈ కండల వీరుడ్ని చూసి షెహనాజ్ అస్సలు వదిలి పెట్టలేదు. కౌగలించుకొని, ముద్దులు పెడుతూ, చేతులు పట్టుకొని వదల్లేదు. వెళ్ళేదాకా సల్మాన్ తోనే ఉంది. ఇక వెళ్ళేటప్పుడు కూడా సల్మాన్ ని చేయి పట్టుకొని కార్ దాకా తీసుకెళ్లింది. కారులో కూర్చున్న తర్వాత కూడా సల్మాన్ బుగ్గ గిల్లి బాయ్ చెప్పింది. దీంతో షెహనాజ్ ప్రవర్తన చూసి పార్టీలో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే షెహనాజ్ ఇంత చేస్తున్నా సల్మాన్ ఏమనకుండా స్మైల్ ఇస్తూ ఉండిపోయాడు.

Manju Warrier : స్టార్ హీరోయిన్‌ని వేధించిన డైరెక్టర్.. అరెస్ట్ చేసిన పోలీసులు..

 

షెహనాజ్ సల్మాన్ కి ముద్దులు, హగ్గులు ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఈ వీడియో చూసిన వారంతా షెహనాజ్ ని ట్రోల్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్ పార్టీల్లో ఇవన్నీ సాధారణమే. కానీ షెహనాజ్ ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే దానికి పెద్ద కారణమే ఉంది. బాలీవుడ్ ప్రముఖ సీరియల్ యాక్టర్ సిద్ధార్థ్‌ శుక్లా గర్ల్ ఫ్రెండ్ షెహనాజ్ గిల్. వీరిద్దరి రిలేషన్ గురించి బాలీవుడ్ లో అందరికి తెలిసిందే. అయితే సిద్దార్థ్ గత సంవత్సరం సెప్టెంబర్ లో హార్ట్ అటాక్ తో అనుకోకుండా మరణించాడు.

Aditi Rao Hydari : లగ్జరీ కారు కొన్న అదితి.. ధర ఎంతో తెలుసా??

 

అయితే బాయ్ ఫ్రెండ్ చనిపోయి సంవత్సరం కూడా కాలేదు అప్పుడే ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవడమే కాక వేరే హీరోకి పబ్లిక్ గా ముద్దులు, హగ్గులు ఇవ్వడం ఏంటి అంటూ షెహనాజ్ ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే కొంతమంది మాత్రం బాయ్ ఫ్రెండ్ అనుకోకుండా చనిపోయాడు, ఇంకా అతని గురించే ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చోవాలా అంటూ షెహనాజ్ కి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి షెహనాజ్ రంజాన్ పార్టీలో సల్మాన్ కి ముద్దులు, హగ్గులు ఇవ్వడంతో బాలీవుడ్ లో ఈ వార్త బాగా వైరల్ అవుతుండటంతో పాటు వీరిద్దరి మధ్య ఏమైనా మొదలైందా అని ఆరా తీస్తున్నారు..