New Hair Growth : బట్టతలకు ఇక గుడ్‌బై.. కొత్త వెంట్రుకలు మొలిచే టెక్నిక్..!

బట్టతల వచ్చిందని బాధపడుతున్నారా? బట్టతలకు ఇక గుడ్‌బై చెప్పేయండి.. కొత్త వెంట్రుకలు మెలిపించే కొత్త గాడ్జెట్ టెక్నిక్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. గామా కిరణాలతో సాధ్యమేనట.

New Hair Growth : బట్టతలకు ఇక గుడ్‌బై.. కొత్త వెంట్రుకలు మొలిచే టెక్నిక్..!

New Hair Growth On Boldhead Using This New Gadget

New Hair Growth : బట్టతల వచ్చిందని బాధపడుతున్నారా? బట్టతలకు ఇక గుడ్‌బై చెప్పేయండి.. కొత్త వెంట్రుకలు మెలిపించే టెక్నిక్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఎంత సంపాదించినా నెత్తినా జుట్టు లేకపోతే.. ఆ బాధ మాటల్లో చెప్పలేం.. అనుభవించేవారికి మాత్రమే తెలుస్తుంది. చాలామంది బట్టతల సమస్య నుంచి బయటపడేందుకు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వైపు చూస్తుంటారు. వాస్తవానికి ఈ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. జుట్టు పెరగడం పక్కనపెడితే లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చిపడతాయి.

అందుకే ఎక్కువ మంది ఈ ట్రాన్స్ ప్లాంటేషన్ వైపు వెళ్లాలంటే భయపడతారు.. మరి.. బట్టతలకు ఏ పరిష్కారం లేదా? అంటే.. ఓ కొత్త టెక్నాలజీ గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. అదే.. స్పెషల్ గ్యాడ్జెట్.. గామా కిరాణాలతో కొత్త జుట్టును మొలిపించవచ్చు.. ఇప్పటికే ఎన్నో పరిశోధనల ఫలితంగా ఈ స్పెషల్ గాడ్జెట్ ఏర్పాటు చేశారు. పట్నాలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS), IITలు కూడా సంయుక్తంగా దృష్టి సారించాయి. గామా కిరణాలతో బట్టతలపై వెంట్రుకలు పుట్టుకొచ్చేలా చేయవచ్చనని తేలింది. అదే దిశగా కృషి చేస్తున్నామని పరిశోధనకర్త డా.యోగేశ్ కుమార్ పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో మహిళల్లో కూడా బట్టతల సమస్య వేధిస్తోంది. ఈ సమస్య వల్ల మహిళల్లో తీవ్ర ఆత్మన్యూనతభావానికి లోనవుతున్న పరిస్థితి. అసలు బట్టతల అనేది ఎలా ప్రారంభమవుతుంది. ఏయే దశలు ఉంటాయో డా.యోగేశ్ కుమార్ వివరణ ఇచ్చారు. అయితే బట్టతల మూడు దశల్లో వస్తుందని ఆయన చెప్పారు. అందులో అనాజెన్.. అంటే.. బట్టతల రావడినికి ముందు ఇది మొదటి దశ. జుట్టు కుదుళ్లలో చీలికలు ఏర్పడతాయి. తద్వారా వెంట్రుకలు పట్టు కోల్పోయి వెంటనే రాలిపోతుంటాయి. ఇక రెండో దశ.. కెటాజెన్.. మొదటిదశ తర్వాత ఇది ప్రారంభమవుతుంది. రెండోదశలో జుట్టు పెరగడం పూర్తిగా ఆగిపోతుంది.

బట్టతల ఆనవాళ్లు క్రమంగా కనిపిస్తుంది. చివరిగా మూడోది టెలోజెన్… ఈ దశలో సమస్య తీవ్రం అవుతుంది. అంటే.. కొత్త జుట్టు మొలవడం ఆగిపోతుంది. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించు కోవాలంటే అది భారీ ఖర్చుతో కూడుకున్నది. అందులోనూ సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి. అందుకే ఐఐటీ-పట్నాలోని ఇంక్యుబేషన్ సెంటర్‌లో ప్రత్యేక గ్యాడ్జెట్‌ను రూపొందించారు. ఈ గాడ్జెట్ ద్వారా గామా కిరణాలతో బట్టతలకు ట్రీట్‌మెంట్ చేస్తారు. టెలోజెన్ దశలోనే సమస్యను కెటాజెన్‌కు మారేలా చేయడం జరుగుతుంది. బట్టతలపై కొత్త వెంట్రుకలు మొలవడం మొదలవుతుందని పేర్కొన్నారు.
Read Also :  Telangana RTC : సార్..మా ఊరికి బస్సు వేయించండి…చీఫ్ జస్టిస్‌కు విద్యార్థిని ఉత్తరం