Sourav Ganguly: గెలిచే జట్టు అదే.. వాళ్లు గట్స్ ఉన్న ప్లేయర్లు – గంగూలీ

వరల్డ్ క్రికెట్‌లో ఇది న్యూజిలాండ్‌ సమయం అని భావిస్తున్నా. ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఎంతో ఉన్నతస్థాయికి చేరింది. కొంతకాలంగా మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. న్యూజిలాండ్‌ చాలా ధైర్యం

Sourav Ganguly: గెలిచే జట్టు అదే.. వాళ్లు గట్స్ ఉన్న ప్లేయర్లు – గంగూలీ

Cricket

Sourav Ganguly: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో చివరి మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. భారీ ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్.. ఆస్ట్రేలియాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. యావత్ క్రికెటక్ ప్రపంచమంతా విన్నర్ ఎవరా అని ఆశగా ఎదురుచూస్తుంది. ఈ తరుణంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మ్యాచ్ ఫేవరేట్స్ గురించి ఇలా మాట్లాడారు.

సీనియర్లందరికీ విరుద్ధంగా ఆస్ట్రేలియా కాకుండా న్యూజిలాండ్ గెలుస్తుందని చెప్పుకొచ్చాడు గంగూలీ.

‘వరల్డ్ క్రికెట్‌లో ఇది న్యూజిలాండ్‌ సమయం అని భావిస్తున్నా. ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఎంతో ఉన్నతస్థాయికి చేరింది. కొంతకాలంగా మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. న్యూజిలాండ్‌ చాలా ధైర్యంగా ఆడుతోంది. కొన్ని నెలల క్రితం కివీస్‌ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచింది. చిన్న దేశమే చాలా బలంగా కనిపిస్తుంది ఆ జట్టు. ఈ సారి కప్ న్యూజిలాండ్ గెలుస్తుందని భావిస్తున్నా’ అని గంగూలీ అన్నాడు.

………………………………. : జైల్లో ఖైదీల మధ్య గ్యాంగ్ వార్.. 68మంది మృతి

ఈ టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా వైఫల్యం కావడంపై గంగూలీ.. మొదటి రెండు మ్యాచ్‌ల్లో పేలవమైన ప్రదర్శనల వల్ల సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించిందని చెప్పాడు. రాబోయే సిరీస్‌లలో పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్‌, కెవిన్‌ పీటర్సన్‌, వసీమ్‌ అక్రమ్‌ ఆస్ట్రేలియానే ఫేవరెట్‌ అని పేర్కొన్నారు.