Puneeth Rajkumar : పునీత్ మరణ వార్త చెప్తూ లైవ్ లోనే ఏడ్చేసిన న్యూస్ రీడర్.. వైరల్ అవుతున్న వీడియో
పునీత్ మరణ వార్తని లైవ్ లో చెప్పాలి అంటే చాలా కష్టం. ఇక కన్నడ న్యూస్ రీడర్స్ ఈ వార్త చెప్పాలి అంటే వాళ్ళకి చెప్పలేని బాధ. పునీత్ మరణ వార్త చెప్తూ ఓ కన్నడ న్యూస్ రీడర్ దుఃఖాన్ని
Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంటే మొన్నటివరకు ఒక స్టార్ హీరో అని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఆయన మరణంతో ఆయన రియల్ హీరో అని దేశమంతా తెలిసింది. పునీత్ అకాల మరణం తర్వాత ఆయనని చూడటానికి వచ్చిన అభిమానులు, వాళ్ళ రోదనలు చూసిన తర్వాత కన్నడ ప్రజల గుండెల్లో ఆయన స్థానమేంటో అర్ధమవుతుంది. సెలబ్రిటీలు సైతం పునీత్‌ను తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారంటే ఆయన మంచితనం ఏంటో తెలుస్తుంది. గత మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా అన్ని ఛానల్స్ లోను పునీత్ మరణం గురించే. అయితే పునీత్ మరణ వార్తని లైవ్ లో చెప్పాలి అంటే చాలా కష్టం. ఇక కన్నడ న్యూస్ రీడర్స్ ఈ వార్త చెప్పాలి అంటే వాళ్ళకి చెప్పలేని బాధ. పునీత్ మరణ వార్త చెప్తూ ఓ కన్నడ న్యూస్ రీడర్ దుఃఖాన్ని ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది.
Vishal : పునీత్ బాధ్యత నేను తీసుకుంటాను : విశాల్
కన్నడలోని బి టివి ఛానల్ లో పునీత్ మరణ వార్త గురించి చెప్తూ ఓ న్యూస్ రీడర్ లైవ్‌లోనే ఏడ్చేసింది. పునీత్ గుండెపోటుతో చనిపోయాడన్న వార్తను చెప్పలేక దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టింది. ఆ తర్వాత కెమెరామ్యాన్, ఛానల్ సిబ్బంది వచ్చి ఆమెను ఓదార్చడంతో బాధను దిగమింగుతూ మిగిలిన వార్తను చదివింది. ఇదంతా లైవ్‌లో టెలికాస్ట్ అయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఒక్క వీడియో చాలు పునీత్ ఎంత గొప్ప వ్యక్త్తో చెప్పడానికి.