Nithin : ‘జూనియర్’గా నితిన్.. మరో సినిమా లైన్లో..

తాజాగా నితిన్ మరో సినిమాకి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. కిక్, ఊసరవెల్లి, టెంపర్, రేసుగుర్రం.. లాంటి సూపర్ హిట్ సినిమాల రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించేందుకు నితిన్.......

Nithin : ‘జూనియర్’గా నితిన్.. మరో సినిమా లైన్లో..

Nithin

Nithin :  హీరో నితిన్ కెరీర్ ఆరంభంలో మంచి హిట్స్ పడ్డా తర్వాత దాదాపు పదేళ్లు ఒక్క విజయం కూడా చూడలేకపోయాడు. ‘ఇష్క్’ సినిమాతో గ్రాండ్ గా సక్సెస్ సాధించాడు నితిన్. ఆ తర్వాత నుంచి ఒక్కో సినిమా ఆచి తూచి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. గత ఏడాది నితిన్ మూడు సినిమాలతో వచ్చాడు. రంగ్ దే, చెక్, మ్యాస్ట్రో సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యాయి. ఇందులో రంగ్ దే, మ్యాస్ట్రో చిత్రాలు పర్వాలేదనిపించినా చెక్ భారీ పరాజయం పాలయింది. మళ్ళీ ఇష్క్ లాంటి భారీ హిట్ కొట్టాలని నితిన్ ఎదురు చూస్తున్నాడు.

ప్రస్తుతం నితిన్ నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీని తర్వాత మరో సినిమా కూడా ఉన్నట్టు సమాచారం. తాజాగా నితిన్ మరో సినిమాకి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. కిక్, ఊసరవెల్లి, టెంపర్, రేసుగుర్రం.. లాంటి సూపర్ హిట్ సినిమాల రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో వక్కంతం వంశీ అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాని డైరెక్షన్ చేశారు. వంశీ డైరెక్టర్ గా అదే మొదటి సినిమా. ఆ సినిమాకి ఆశించినంతగా ఫలితం దక్కలేదు.

Pawan Kalyan : తన డైరెక్టర్స్‌తో పవర్ స్టార్.. వైరల్ అవుతున్న ఫొటో..

దీంతో మరోసారి డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకొని ఈ సారి ఎలాగైనా నితిన్ తో హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు వక్కంతం వంశీ. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయిందని దానికి టైటిల్ కూడా పెట్టేసినట్టు సమాచారం. నితిన్ తో తెరకెక్కించే సినిమాకి జూనియర్ అనే టైటిల్ తో రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే టైటిల్ తో షూట్ కి వెళ్లాలని అనుకుంటున్నారు. త్వరలోనే ఈ ‘జూనియర్’ సినిమా షూట్ కి వెళ్లనున్నట్టు సమాచారం. మరి సినిమా వరకు ఈ టైటిల్ ఉంటుందా లేక మారుతుందో చూడాలి.