Nithya Menen : సినిమాలకి బ్రేక్ ఇస్తున్నాను.. పెళ్లిపై నిత్యామీనన్ క్లారిటీ..

నిత్యామీనన్ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా నేను పెళ్లి చేసుకుంటాను అని వార్తలు వస్తున్నాయి. నేను కూడా ఆ న్యూస్ చదివాను. అందులో ...........

Nithya Menen : సినిమాలకి బ్రేక్ ఇస్తున్నాను.. పెళ్లిపై నిత్యామీనన్ క్లారిటీ..

Nithya Menen :  మలయాళ భామ నిత్యామీనన్ అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ వరుస సినిమాలతో మంచి విజయాలు సాధించింది. గత కొన్ని రోజులుగా వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు, షోలతో బిజీగా ఉంది. ఇటీవల మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులని పలకరించింది. కొన్ని రోజుల క్రితం ఇంట్లో మెట్ల మీద నుంచి పడి కాలికి గాయం అయింది. దీంతో ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది నిత్య. గత కొన్ని రోజులుగా నిత్యా మీనన్ పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా నిత్యా మీనన్ దీనికి స్పందిస్తూ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. అలాగే సినిమాలకి కొన్ని రోజులు బ్రేక్ ఇస్తున్నాను అని తెలిపింది.

Latti : విశాల్, నేను చిన్నప్పటి ఫ్రెండ్స్.. కలిసి చాలానే చేశాం సినిమా తప్ప అంటున్న సీఎం తనయుడు..

 

ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఒక వీడియోని విడుదల చేసింది. ఇందులో నిత్యామీనన్ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా నేను పెళ్లి చేసుకుంటాను అని వార్తలు వస్తున్నాయి. నేను కూడా ఆ న్యూస్ చదివాను. అందులో ఎలాంటి నిజం లేదు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. ఒక సంవత్సరం నుంచి నేను సినిమా, వెబ్‌ సిరీస్‌లు, షోలు.. ఇలా ఖాళీ లేకుండా ఉన్నాను. ప్రస్తుతం కొన్ని రోజులు అన్నిటికి బ్రేక్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈ బ్రేక్ పెళ్లి కోసం మాత్రం కాదు. అలాగే నా కాలికి అయిన గాయం మెల్లిగా తగ్గుతుంది. మెల్లిగా నడుస్తున్నాను. ఇది పూర్తిగా నయం అవ్వాలన్నా ఇంకో రెండు నెలల పైనే పడుతుంది. అందుకే కొన్ని రోజులు అన్నిటికి బ్రేక్ తీసుకుంటున్నాను” అని తెలిపింది. దీంతో నిత్యా మీనన్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకొని, మళ్ళీ సినిమాలు చేయాలని కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)