Nokia X100: నోకియా 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి!
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో తన ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది నోకియా.
Nokia X100: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో తన ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది నోకియా. ఈ క్రమంలోనే ప్రీమియం ఫీచర్లతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ని లాంఛ్ చేసింది. సి సిరీస్, జి సిరీస్‌తో పాటు ఎక్స్ సిరీస్‌లో మొత్తం ఆరు కొత్త స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టింది సంస్థ. నోకియా ఎక్స్100 పేరుతో స్మార్ట్ ఫోన్ అమెరికాలో అందుబాటులోకి తీసుకుని వచ్చింది. 5జీ ఫీచర్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో.. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌పై ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో ఫోన్‌ను తీసుకుని వచ్చింది నోకియా.
ర్యామ్, స్టోరేజ్ సామర్థ్యాలను బట్టి చూస్తే ఇది 6 జీబీ + 128 కాన్ఫిగరేషన్లలో స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర విషయానికి వస్తే.. ఇది 252 యుఎస్ డాలర్లు.. భారత కరెన్సీలో సుమారు రూ.18,700 వద్ద లభించనుంది. మిడ్నైట్ బ్లూ కలర్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. నవంబర్ 19వ తేదీ నుంచి ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది.
నోకియా ఎక్స్100 స్పెసిఫికేషన్లు:
1. నోకియా ఎక్స్100 మోడల్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తుంది. ఇది 20: 9 నిష్పత్తిని కలిగి ఉంటుంది.
2. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
3. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
4. 15 జీబీ గూగుల్ డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్
5. హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ (నానో + నానో / మైక్రో SD) స్లాట్‌తో వస్తుంది.
6. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
7. కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుక భాగంలో 48MP LED ఫ్లాష్ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డెప్త్, 2MP మాక్రో కెమెరాలను చేర్చింది. కాగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం దీనిలో ప్రత్యేకంగా 16MP ఫ్రంట్ కెమెరాను అందించింది.
8. సైడ్ -మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను చేర్చింది.
9. 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియోలను అందించింది.
10. కనెక్టివిటీ ఫీచర్ల పరంగా చూస్తే.. డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.1, GPS, USB Type-C వంటివి ఇందులో ఉన్నాయి.
11. 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 4470 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. బరువు 217 గ్రాములుగా ఉంది.
Padma Shri: దేశవ్యాప్తంగా కంగనా పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్