RRR: ఎన్టీఆర్ బుల్లెట్ బైక్ ఫైట్.. వెనక ఇంత పెద్ద కథ నడిచిందా?!

ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు టాప్ యాంకర్ సుమతో రాజమౌళి-రామారావు-రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ చేశారు. ఇందులో సినిమాలో ఎన్టీఆర్ బుల్లెట్ బైక్ మీద ఫైట్ గురించి ఓ సీక్రెట్ రిలీవ్ చేశారు.

RRR: ఎన్టీఆర్ బుల్లెట్ బైక్ ఫైట్.. వెనక ఇంత పెద్ద కథ నడిచిందా?!

Rrr (2)

RRR: మార్చ్ 25.. డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ పీక్స్ కు చేరుకుంటున్నాయి. చిత్ర యూనిట్ అంతా భారీ స్థాయి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చూసుకొనే రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ మల్టీస్టారర్ సినిమాకి మరింత పగడ్బంధీగా ప్రమోషన్ ఏర్పాటు చేశారు. ఒక షెడ్యూల్ ప్రకారం దర్శకుడు రాజమౌళి, హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేశ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్ లో మునిగిపోయారు.

RRR: గయ్యాళి అత్త సుమ.. నోరు లేని భర్త రాజీవ్.. తారక్ ఫన్నీ కామెంట్స్!

ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు టాప్ యాంకర్ సుమతో రాజమౌళి-రామారావు-రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ చేశారు. ఇందులో సినిమాలో ఎన్టీఆర్ బుల్లెట్ బైక్ మీద ఫైట్ గురించి ఓ సీక్రెట్ రిలీవ్ చేశారు. ముందుగా ఈ ఫైట్ ను ముంబైలో షూట్ చేశారట. అయితే, తర్వాత రషెష్ చూసి అందులో లైటింగ్, ఫైర్ వర్క్ సరిగా ఎలివేషన్ కాలేదని.. మళ్ళీ హైదరాబాద్ లో మరోసారి షూట్ చేశారట. అందుకోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్, భారీ క్రేన్లను ఉపయోగించి ఈవెంట్ గ్రౌండ్ సెటప్ చేసి మళ్ళీ ఆ ఫైట్ మొత్తాన్ని రీ షూట్ చేశారట.

 

అంతేకాదు.. ఈ సీన్ కోసమే ముంబై నుండి అందులో గుర్రాన్ని, బైక్ ను హైదరాబాద్ రప్పించాడట రాజమౌళి. ఆర్ఆర్ఆర్ టీం మొత్తం ఫ్లైట్ జర్నీలో ఉండగా తారక్ కార్తికేయను ఫన్నీ ఇమిటేషన్ చేస్తున్న సమయంలోనే కార్తికేయ ఈ ఫైట్ సరిగా రాలేదని మళ్ళీ చెప్పాడట. దీంతో ఉలిక్కిపడిన తారక్ అందుకోసం తనను రాజమౌళి పెట్టిన హింసను గుర్తుచేసుకొని మళ్ళీ ఇదంతా చేయాలా అని తెగ ఫీలయ్యాడట. అయినా వదలని జక్కన్న హైదరాబాద్ లోనే సెట్ వేసి మళ్ళీ అది మొత్తం రీషూట్ చేశాడట.