NTR : అభిమానుల పై ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్.. వీడియో వైరల్!

ఇటీవలే అమెరికా వెళ్లిన ఎన్టీఆర్.. అక్కడ ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్.. అభిమానుల పై ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

NTR : అభిమానుల పై ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్.. వీడియో వైరల్!

ntr fans

NTR : జూనియర్ ఎన్టీఆర్.. తన నటనతో తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇక RRR సినిమాతో అయితే గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ యాక్టింగ్ కి హాలీవుడ్ ఆడియన్స్ కూడా అభిమానులు అయిపోతున్నారు. హాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు టెక్నీషియన్స్, మీడియా కూడా ఎన్టీఆర్ నటనను పొగుడుతున్నారు. ప్రస్తుతం RRR మూవీ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే.

Oscars 2023 : ఆస్కార్ అవార్డుల వేడుక ఓటిటిలో కూడా లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు..

మార్చి 12 రాత్రి ఈ అవార్డుల పురస్కారం జరగనుంది. ఈ వేడుకలో పాల్గొనేందుకు గత వారమే రామ్ చరణ్ అమెరికా వెళ్లగా, తారకరత్న మరణం వలన ఎన్టీఆర్ ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. తారకరత్న పెద్దకర్మ కూడా పూర్తి కావడంతో ఇటీవలే ఎన్టీఆర్ కూడా అమెరికా వెళ్ళాడు. అమెరికా చేరుకున్న ఎన్టీఆర్ అక్కడ ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్.. అభిమానుల పై ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

NTR30: ఆ సూపర్ హిట్ పాటను రీమిక్స్ చేస్తున్న తారక్-జాన్వీ..?

”మీ అభిమానాన్ని ఎలా వర్ణించాలో నాకు అర్ధం కావడంలేదు. కానీ ఒకటి మాత్రం నిజం. మీరు నా పై ఎంత ప్రేమ చూపిస్తున్నారో, మీ పై కూడా అంతే ప్రేమని నేను నా గుండెల్లో దాచుకున్నా. నేను దానిని చూపించలేక పోతున్నాను అంతే. లెక్క పరంగా నేను మీ స్థానంలో ఉండాలి, మీరు నా స్థానంలో ఉండాలి. నేను ఏమి చేసి మీకు ఇంత దగ్గరయ్యానో నాకు తెలియదు. మీతో నాది రక్త సంబంధం కంటే చాలా పేద బంధం. ఇంతటి ప్రేమని నాకు అందిస్తునందుకు నేను ఒకటే చేయగలను, అది మీకు పాదాభివందనాలు చేయడమే” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా ఇండియన్ టైం ప్రకారం మార్చి 13 ఉదయం గం. 5:30 నిముషాలు నుంచి ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ మొదలు కానుంది. ఈ వేడుకను ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.