NTR for Oscars : ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ ఫర్ ఆస్కార్స్.. ఈ టాప్ 10 కన్సిడర్ చేయండి ఆస్కార్ అంటూ హాలీవుడ్ మీడియా..

తాజాగా హాలివుడ్ ఫేమస్ న్యూస్ సైట్ USA టుడే ఓ పదిమంది బెస్ట్ పర్ఫార్మెన్స్ ల పేర్లని సజెస్ట్ చేస్తూ ఆస్కార్ సభ్యులు ఈ పదిమందిని కచ్చితంగా కన్సిడర్ చేయాలి అంటూ పోస్ట్ చేసింది. ఈ పదిమందిలో RRR సినిమా నుంచి.............

NTR for Oscars : ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ ఫర్ ఆస్కార్స్.. ఈ టాప్ 10 కన్సిడర్ చేయండి ఆస్కార్ అంటూ హాలీవుడ్ మీడియా..

NTR for Oscars trend in social media

NTR for Oscars :  సినీ ప్రేమికులంతా ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మార్చ్ లో ఈ అవార్డుల వేడుక జరుగనుంది. ప్రస్తుతం ఆస్కార్ కి అన్ని విభాగాల్లోనూ షార్ట్ లిస్ట్ చేసే పనిలో ఉన్నారు అకాడమీ సభ్యులు. ఈ సారి ఆస్కార్ అవార్డ్స్ ఇండియా వాళ్లకి మరింత రసవత్తరంగా ఉండబోతున్నాయి. ఈ సారి కచ్చితంగా ఏదో ఒక విభాగంలో ఆస్కార్ ఇండియాకి వస్తుందని RRR సినిమా మీద నమ్మకంతో ఉన్నారు సినీ ప్రేమికులు.

రాజమౌళి కూడా అమెరికాలోనే ఉంటూ ఆస్కార్ టార్గెట్ గా పెట్టుకొని RRR సినిమాని విపరీతంగా హాలీవుడ్ లో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు, పలు హాలీవుడ్ అవార్డులు వివిధ విభాగాల్లో సాధించడంతో ఆస్కార్ ఎలాగైనా సాధిస్తామని నమ్మకంతో రాజమౌళి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు, ముఖ్యంగా అభిమానులు RRR కి ఆస్కార్ రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. కొంతమంది ట్విట్టర్ లో ట్రెండ్ కూడా చేస్తునారు.

Bharath : అల్లు అర్జున్ గంగోత్రి సినిమాని రీమేక్ చేద్దామనుకున్నా.. కానీ..

తాజాగా హాలివుడ్ ఫేమస్ న్యూస్ సైట్ USA టుడే ఓ పదిమంది బెస్ట్ పర్ఫార్మెన్స్ ల పేర్లని సజెస్ట్ చేస్తూ ఆస్కార్ సభ్యులు ఈ పదిమందిని కచ్చితంగా కన్సిడర్ చేయాలి అంటూ పోస్ట్ చేసింది. ఈ పదిమందిలో RRR సినిమా నుంచి ఎన్టీఆర్ కూడా ఉండటంతో ఇక్కడి అభిమానులు ఎన్టీఆర్ ఫర్ ఆస్కార్స్ అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.

USA టుడే సజెస్ట్ చేసిన పది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవే..

ఎన్టీఆర్ – RRR
టామ్ క్రూజ్ – టాప్ గన్ మెవరిక్
పాల్ దానో – ది బ్యాట్ మ్యాన్
మియా గోత్ – పెరల్
నినా హోస్ – తార్
జో క్రావిట్జ్ – కిమీ
లశ్చన లించ్ – ది ఉమెన్ కింగ్
పాల్ మెస్కెల్ – ఆఫ్టర్ సన్
కేకే పామర్ – నోప్
జెరెమీ పాప్ – ది ఇన్స్పెక్షన్