NTR: బింబిసారుడికి భీమ్ అభయం.. బాక్సాఫీస్‌కు చుక్కలేనట!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘బింబిసారా’ సినిమా ప్రివ్యూను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చూశాడట. ఈ సినిమా అత్యద్భుతంగా వచ్చిందని, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడట.

NTR: బింబిసారుడికి భీమ్ అభయం.. బాక్సాఫీస్‌కు చుక్కలేనట!

Ntr Prediction On Kalyan Ram Bimbisara Movie

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాల ఎంపికలో తనదైన మెచ్యూరిటీని చూపిస్తూ ముందుకెళ్తున్నాడు. అంతేగాక ఇతర హీరోల సినిమాలు బాగుంటే వాటిని మెచ్చుకోవడంలోనూ తారక్ ఎప్పుడూ ముందుంటాడు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో భీమ్ పాత్రలో తన నటవిశ్వరూపాన్ని ఈ ప్రపంచానికి చూపించిన తారక్, ఇప్పుడు మరో హీరో, తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్‌కు అభయం ఇస్తున్నాడు. ఇంతకీ తారక్ కళ్యాణ్ రామ్‌కు ఏ విషయంలో అభయం ఇస్తున్నాడు.. అసలు ఈ మ్యాటర్ ఏమిటో తెలుసుకుందామా..!

Bimbisara: బింబిసారా నుండి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

నందమూరి కళ్యాణ్ రామ్ గత కొంతకాలంగా సరైన హిట్స్ లేక సతమతమవుతున్నాడు. దీంతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవాలనే కసిలో ఉన్నాడు ఈ హీరో. ఈ క్రమంలోనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ కథను ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ‘బింబిసారా’ అనే డిఫరెంట్ సబ్జెక్ట్ మూవీతో మనముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు కళ్యాణ్ రామ్. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ప్రివ్యూను జూనియర్ ఎన్టీఆర్ తాజాగా చూసినట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Bimbisara : కళ్యాణ్ రామ్ ‘బింబిసార 2’లో ఎన్టీఆర్.. జోష్ లో నందమూరి అభిమానులు..

ఈ క్రమంలోనే బింబిసారా చిత్రాన్ని చూసిన తారక్, కళ్యాణ్ రామ్ అండ్ టీమ్‌ను అభినందనలతో ముంచెత్తాడట. వైవిధ్యమైన కథను ఎంచుకోవడం దగ్గర్నుండి, సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడా మిస్ కాకుండా, ప్రేక్షకులను కట్టిపడేసే అంశాలు పుష్కలంగా ఉండటంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని తారక్ ధీమా వ్యక్తం చేశాడట. ఇక కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్, ఈ సినిమాకే హైలైట్ కానుందని తారక్ మెచ్చుకున్నాడట. ఇలా తన అన్న నటిస్తున్న సినిమాకు తారక్ ఇచ్చిన రెస్పాన్స్‌తో కళ్యాణ్ రామ్ అండ్ టీమ్ రెట్టింపు ఉత్సాహంతో ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్నారట. మల్లిడి వశిష్ట్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.