NTR : తనయులతో ఎన్టీఆర్ దీపావళి స్పెషల్ పిక్

సెలబ్రిటీ కిడ్స్ గా వారికి కూడా బాగానే ఫాలోయింగ్ ఉంటుంది. కాని ఇందుకు ఎన్టీఆర్ మినహాయింపు. ఎందుకంటే ఎన్టీఆర్ తన తనయులని ఎక్కువగా బయటకి చూపించడు

NTR : తనయులతో ఎన్టీఆర్ దీపావళి స్పెషల్ పిక్

Ntr Sons (1)

NTR :  దీపావళి సందర్భంగా నిన్న సెలబ్రిటీలంతా తాము సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సెలబ్రిటీలు వారి కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కుమారులతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు.

Samantha : రెమ్యునరేషన్ పెంచేసిన సమంత.. వర్క్ అవుట్ అవుతుందా??

చాలా మంది హీరోలు, హీరోయిన్స్ పిల్లల ఫోటోలను ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. సెలబ్రిటీ కిడ్స్ గా వారికి కూడా బాగానే ఫాలోయింగ్ ఉంటుంది. కాని ఇందుకు ఎన్టీఆర్ మినహాయింపు. ఎందుకంటే ఎన్టీఆర్ తన తనయులని ఎక్కువగా బయటకి చూపించడు. వారి ఫోటోలని ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఇద్దరి కుమారుల ఫొటోల్లో బయటకి వచ్చినవి కనీసం 10 ఫోటోలు కూడా ఉండవు. అందుకే అభిమానులు ఎన్టీఆర్ తనయుల ఫొటోస్ కోసం ఎదురు చూస్తుంటారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దీపావళి సందర్భంగా తన ఇద్దరు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి దిగిన దీపావళి స్పెషల్ పిక్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ఫాన్స్ ఈ ఫోటో చూసి సంబరపడిపోతున్నారు.