Balakrishna : మరోసారి వివాదంలో బాలకృష్ణ.. క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్!

నందమూరి బాలకృష్ణ కొన్ని రోజులుగా వరుస వివాదంలో చిక్కుకుంటున్నాడు. ఇటీవల ప్రసారం అయిన పవన్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ లో బాలయ్య మాట్లాడిన కొన్ని మాటలు పై ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.

Balakrishna : మరోసారి వివాదంలో బాలకృష్ణ.. క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్!

balakrishna

Balakrishna : నందమూరి బాలకృష్ణ కొన్ని రోజులుగా వరుస వివాదంలో చిక్కుకుంటున్నాడు. ఇటీవల ‘వీరసింహారెడ్డి’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో దేవబ్రాహ్మణల మనోభావాలను దెబ్బ తీసేలా బాలకృష్ణ వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ ఆ సంఘం వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దానికి బాలకృష్ణ స్పందిస్తూ బహిరంగా లేఖ ద్వారా క్షమాపణలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా అక్కినేని నాగేశ్వరరావుని అవమానపరిచేలా బాలయ్య వ్యాఖ్యానించారు అంటూ వివాదం రాచుకుంది.

Balakrishna : ఏఎన్నార్ నాకు బాబాయ్ లాంటి వారు.. ఫ్లోలో వచ్చిన మాటలని వివాదాస్పదం చేశారు..

ఈ వ్యాఖ్యలు పై అక్కినేని హీరోలు కూడా అభ్యంతరం తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల ప్రసారం అయిన పవన్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ లో బాలయ్య మాట్లాడిన కొన్ని మాటలు పై ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ షోలో బాలయ్య తనకి గతంలో జరిగిన యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ.. ‘ఆ నర్సు, దానమ్మ భలే అందంగా ఉందిలే’ అంటూ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి అంటూ ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ పేర్కొన్నాడు.

బాలకృష్ణ వెంటనే ఈ మాటలను వెనక్కి తీసుకోవాలని, నర్సులకు తాను బహిరంగా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. క్షమాపనులు తెలియజేయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అంటూ హెచ్చరించారు. మరి దీని పై బాలకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇటీవల అక్కినేని వివాదంలో కూడా అభిమాన సంఘం క్షమాపణలు చెప్పాలి అని కోరగా బాలయ్య నిరాకరించిన విషయం తెలిసిందే.

కాగా పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రాగా, భారీ రేటింగ్ ని నమోదు చేసింది. తాజాగా నేడు (ఫిబ్రవరి 5) ఈ ఎపిసోడ్ సెకండ్ పార్ట్ ప్రోమోని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈ రెండో భాగం ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.