Ori Devuda : ‘ఓరి దేవుడా’ అంటున్న విశ్వక్ సేన్

స్టోరీ నేరేషన్ విజయ్ సేతుపతి పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది.. ఆ క్యారెక్టర్‌లో ఓ స్టార్ హీరో కనిపించబోతున్నారు..

Ori Devuda : ‘ఓరి దేవుడా’ అంటున్న విశ్వక్ సేన్

Ori Devuda

Ori Devuda: ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా.. అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో.. పివిపి సినిమా, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల మీద పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘ఓరి దేవుడా’..

Jai Bhim : రియల్ సినతల్లి ఈమే..

తమిళ్‌లో క్లాసిక్ లవ్ స్టోరీగా ట్రెండ్ క్రియేట్ చేసిన మూవీ ‘ఓ మై కడవులే’.. అశోక్ సెల్వన్, రితికా సింగ్, వాణి భోజన్ లీడ్ రోల్స్ చెయ్యగా.. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కీ క్యారెక్టర్ చేశారు. ఈ సినిమానే తెలుగులో ‘ఓరి దేవుడా’ పేరుతో రీమేక్ చేస్తున్నారు.

Allu Arjun : క్రేజీ కాంబో.. విశ్వక్ సేన్ లవ్ స్టోరీలో బన్నీ..

రీసెంట్‌గా టైటిల్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అయిన హీరో, హీరోయిన్ లవ్ మ్యారేజ్ చేసుకోవడం, తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం కోర్టుకెళ్లడం, చివరకు వాళ్లు విడిపోయారా.. తిరిగి ఒక్కటయ్యారా? అనే ఆసక్తికర అంశాలతో తెరకెక్కిన ‘ఓ మై కడవులే’ తమిళనాట సూపర్ హిట్ అయ్యింది. స్టోరీ నేరేషన్ విజయ్ సేతుపతి పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది. ఆ క్యారెక్టర్‌లో ఓ స్టార్ హీరో కనిపించబోతున్నారు.