Pathaan Offer: పఠాన్ ఆఫర్.. ఈ సారి ఏకంగా ఒక టికెట్ కొంటే ఇంకోటి ఫ్రీ..

ఇప్పటికే సినిమా రిలీజ్ అయి నెల రోజులు పైగా అవ్వడం, అన్ని పరిశ్రమల లోను వేరే సినిమాలు వచ్చేస్తుండటంతో పఠాన్ కి వచ్చే ఆడియన్స్ తగ్గిపోయారు. దీంతో తాజాగా మరో ఆఫర్ ని ఇచ్చింది పఠాన్ చిత్రయూనిట్.............

Pathaan Offer: పఠాన్ ఆఫర్.. ఈ సారి ఏకంగా ఒక టికెట్ కొంటే ఇంకోటి ఫ్రీ..

Pathaan movie offers for attracting audience

Pathaan Offer:  షారుఖ్, దీపికా జంటగా, జాన్ అబ్రహం విలన్ గా, సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా మంచి విజయం సాధించి, చాలా రోజుల తర్వాత బాలీవుడ్ లో హిట్ టాక్ తెచ్చుకొని భారీ కెల్క్షన్స్ సాధించింది. ఈ సినిమాతో చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత షారుఖ్ హిట్ కొట్టడమే కాకుండా గత సంవత్సర కాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్ కి పెద్ద విజయాన్ని అందించాడు. ఈ సినిమా ఇప్పటికే 1020 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది.

అయితే పఠాన్ ఈ 1000 కోట్ల కలెక్షన్స్ ని కలెక్ట్ చేయడానికి చాలానే కష్టపడింది. మొదటి వారంలో 600 కోట్లు కలెక్ట్ చేసేసరికి అంతా పఠాన్ సినిమా బాహుబలి 2, KGF 2 సినిమాల కలెక్షన్స్ దాటేస్తుందని భావించారు. కానీ మొదటి వారం తర్వాత కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. పఠాన్ సినిమా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావడానికి దాదాపు నెల రోజులు పట్టింది. అది కూడా చివరి వారం టికెట్ రేట్లు బాగా తగ్గించి ఆఫర్స్ ఇవ్వడంతో కనీసం నెల లోపైనా వచ్చాయి ఆ కలెక్షన్స్. లేకపోతే ఇప్పట్లో వచ్చేవి కావు. రెండు వారాలకే సినిమాకి వచ్చే ఆడియన్స్ తగ్గిపోవడంతో మొదట వీకెండ్స్ లో 250 రూపాయలు ఉండే టికెట్ ని 110 రూపాయలకే ఇచ్చారు. ఆ తర్వాత చివరి వారం అంతా కూడా ఇదే ఆఫర్ మెయింటైన్ చేసి మొత్తానికి 1000 కోట్లు సాధించారు.

బాహుబలి 2, KGF 2 సినిమాల కలెక్షన్స్ దాటలేవని పఠాన్ యూనిట్ కి అర్దమవ్వడంతో హిందీ టార్గెట్ గా అయినా రికార్డులు సాధించాలని ట్రై చేసింది. ప్రస్తుతం హిందీ బెల్ట్ లో అత్యధిక షేర్ కలెక్ట్ చేసిన హిందీ సినిమాగా నిలిచింది. అయితే హిందీ బెల్ట్ లో బాహుబలి 2 సినిమా 512 కోట్లు షేర్ కలెక్ట్ చేయగా పఠాన్ ఇప్పటికి 509 కోట్లని కలెక్ట్ చేసింది. దీంతో కనీసం ఈ రికార్డ్ అయినా కొట్టాలని గత మూడు రోజులుగా ట్రై చేస్తుంది పఠాన్. ఇప్పటికే సినిమా రిలీజ్ అయి నెల రోజులు పైగా అవ్వడం, అన్ని పరిశ్రమల లోను వేరే సినిమాలు వచ్చేస్తుండటంతో పఠాన్ కి వచ్చే ఆడియన్స్ తగ్గిపోయారు. దీంతో తాజాగా మరో ఆఫర్ ని ఇచ్చింది పఠాన్ చిత్రయూనిట్.

Venkatesh : ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ చేశాను.. రానాకి ఎదురుగా నటించాలంటే కష్టమే..

మార్చ్ 3 నుంచి మార్చ్ 5 వరకు పఠాన్ సినిమా టికెట్ మల్టీప్లెక్స్ లలో ఒకటి కొంటే ఇంకో టికెట్ ఉచితం అని పెట్టారు. అంతే కాకుండా మార్చ్ 3 శుక్రవారం ఒక్కరోజు 110 రూపాయలకే ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ అని పెట్టారు. మరీ ఈ రేంజ్ ఆఫర్స్ పెట్టడంతో బాలీవుడ్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి ఫైనల్ గా పఠాన్ సినిమా ఎంత కలెక్ట్ చేయాలనుకుంటుందో చూడాలి.