Pathaan Success Meet : గ్రాండ్ గా పఠాన్ సక్సెస్ మీట్.. హగ్గులు, ముద్దులు, డ్యాన్సులు.. రచ్చ చేసిన షారుఖ్..
పఠాన్ సినిమాకి ప్రమోషన్స్ చేయలేదు. ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. రిలీజ్ కి ముందు పఠాన్ సినిమాకి ఉన్న నెగిటివిటీని చూసి ప్రమోషన్స్ చేయకపోతేనే మంచిదానికి భావించారు. అయితే పఠాన్ సినిమా రిలీజయి ఇంతటి భారీ విజయం సాధించి కలెక్షన్స్ కొల్లగొడుతుండటంతో తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్.....................
Pathaan Success Meet : షారుఖ్ ఖాన్ హీరోగా, దీపికా పదుకొనే హీరోయిన్ గా, జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా ఇటీవల జనవరి 25న థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. నాలుగేళ్ల తర్వాత షారుఖ్ తెరపై కనిపిస్తుండటంతో అభిమానులు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ సినిమా మొదటి రోజు నుంచి కూడా భారీగా కలెక్షన్స్ వసూలు చేస్తూ సరికొత్త రికార్డులని సృస్తిస్తుంది. ఇప్పటికే పఠాన్ సినిమా అయిదు రోజుల్లో 542 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి సరికొత్త రికార్డుని సృష్టించింది.
పఠాన్ సినిమాకి ప్రమోషన్స్ చేయలేదు. ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. రిలీజ్ కి ముందు పఠాన్ సినిమాకి ఉన్న నెగిటివిటీని చూసి ప్రమోషన్స్ చేయకపోతేనే మంచిదానికి భావించారు. అయితే పఠాన్ సినిమా రిలీజయి ఇంతటి భారీ విజయం సాధించి కలెక్షన్స్ కొల్లగొడుతుండటంతో తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. పఠాన్ సక్సెస్ ప్రెస్ మీట్ సోమవారం సాయంత్రం ముంబైలో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో షారుఖ్, దీపికా, జాన్ అబ్రహం, డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ పాల్గొన్నారు. మీడియాతో ముచ్చటించి వారు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు.
Hansika : మొన్న నయనతార.. ఇప్పుడు హన్సిక.. ఓటీటీలకు పెళ్లి వీడియోలు అమ్ముకుంటున్న హీరోయిన్స్..
ఈ ప్రెస్ మీట్ లో షారుఖ్ దీపికా, జాన్ అబ్రహంలతో కలిసి సందడి చేశాడు. మీడియా వాళ్ళతో జోకులు వేశాడు. ఇక దీపికా, జాన్ అబ్రహం, షారుఖ్, సిద్దార్థ్ ఆనంద్ కలిసి పఠాన్ పాటకి స్టేజిపై స్టెప్పులు వేశారు. షారుఖ్ స్టైలిష్ గా ఫోజులు ఇచ్చాడు. జాన్ అబ్రహంని ముద్దు పెట్టుకున్నాడు షారుఖ్ ఖాన్. అలాగే దీపికా చేతికి ముద్దుపెట్టాడు. ఒకర్నొకరు ప్రేమగా హగ్ చేసుకున్నారు. అనేక విషయాలు మాట్లాడిన అనంతరం ఈ సినిమాని పెద్ద హిట్ చేసినందుకు అందరికి థ్యాంక్స్ చెప్పారు చిత్రయూనిట్. మొత్తానికి ఈ సక్సెస్ ప్రెస్ మీట్ లో షారుఖ్ సరదాగా సందడి చేయడంతో ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
Mehmaan Nawaazi ke liye #Pathaan ki poori team aayi hai ? pic.twitter.com/DZ5af7A43V
— Yash Raj Films (@yrf) January 30, 2023
Shah Rukh Khan such a sweet gesture to John Abraham, that's why we love you King Khan ?❤️?
PATHAAN 500 CR IN 5 DAYS ?#ShahRukhKhan #JohnAbraham#PathaanCollection #Pathan#pathaanboxoffice #SRKians pic.twitter.com/qLYlUnW83V— Ashutosh Srivastava ?? (@sri_ashutosh08) January 30, 2023
His signature pose King ? Khan #shahrukhkhan pic.twitter.com/fJTtLN9fMg
— Viral Bhayani (@viralbhayani77) January 30, 2023