Pawan Kalyan : టాలీవుడ్‌లో అత్యంత వేగంగా ఇన్‌స్టాగ్రామ్ 1 మిలియన్ ఫాలోవర్స్ తెచ్చుకున్న హీరోగా పవర్ స్టార్ రికార్డ్..

పవన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తో సరికొత్త రికార్డు సృష్టించాడు. టాలీవుడ్ లోనే అత్యంత వేగంగా 1 మిలియన్ ఫాలోవర్స్ అందుకున్న హీరోగా రికార్డ్ సెట్ చేశాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కేవలం...............

Pawan Kalyan : టాలీవుడ్‌లో అత్యంత వేగంగా ఇన్‌స్టాగ్రామ్ 1 మిలియన్ ఫాలోవర్స్ తెచ్చుకున్న హీరోగా పవర్ స్టార్ రికార్డ్..

Pawan Kalyan creates new record in Instagram with fastest 1 million followers in Tollywood Heros

Pawan Kalyan Instagram :  సాధారణంగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇస్తే అభిమానులు సంతోషిస్తారు, ఫాలోయింగ్ మరింత ఎక్కువవుతుంది. ఇక టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. అయితే పవన్ తన ట్విట్టర్ అకౌంట్ లో సినిమాల గురించి మాత్రం పోస్ట్ చేయరు. కేవలం పాలిటిక్స్, జనసేన పోస్టులు మాత్రమే పోస్ట్ చేస్తారు. తాజాగా పవన్ కళ్యాణ్ నిన్న ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

నిన్న ఉదయం పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లో తన అధికారిక అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ టీం ఈ అకౌంట్ ని మేనేజ్ చేస్తుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ లో కూడా పవన్ జనసేనకు, పాలిటిక్స్ కి సంబంధించిన పోస్టులే చేస్తారని, సినిమాకు సంబంధించినవి మాత్రం చేయకపోవచ్చని సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లోకి వచ్చాడని తెలియగానే అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు ఆయన్ని ఫాలో అవుతున్నారు. నిమిషం నిమిషంకి పవన్ అకౌంట్ కి ఫాలోవర్స్ భారీగా పెరిగారు. ఒక్కరోజులోనే పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కి ఏకంగా 1.7 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు.

పవన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తో సరికొత్త రికార్డు సృష్టించాడు. టాలీవుడ్ లోనే అత్యంత వేగంగా 1 మిలియన్ ఫాలోవర్స్ అందుకున్న హీరోగా రికార్డ్ సెట్ చేశాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కేవలం 6 గంటల 20 నిమిషాల్లోనే 1 మిలియన్ ఫాలోవర్స్ ని అందుకున్నారు. ఇక ఒక్కరోజులో 1.7 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరోకి ఇంత త్వరగా ఇంతమంది ఫాలోవర్స్ రాలేదు.

Kushi : ‘ఖుషి’ సినిమా షూటింగ్ పూర్తి.. సాంప్రదాయ దుస్తుల్లో విజయ్, సమంత.. అప్డేట్ ఇస్తూ వీడియో రిలీజ్..

టాలీవుడ్ హీరోల్లో ఇన్‌స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ రావడానికి ప్రభాస్ కి 23 రోజుల సమయం పట్టగా, రామ్ చరణ్ కి 74 రోజులు, మహేష్ బాబు కి 89 రోజులు, అల్లు అర్జున్ కి 184 రోజులు, ఎన్టీఆర్ కి 416 రోజులు పట్టింది. అయితే వీళ్ళు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చూసేటప్పటికి సోషల్ మీడియాలో అంతమంది లేరు కాబట్టి అన్ని రోజులు పట్టింది అని ఆయా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ హీరో ఇన్‌స్టాగ్రామ్ లో రికార్డ్ సెట్ చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.