Pawan Kalyan : ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ చేస్తున్న పవర్ స్టార్.. టార్గెట్ 2024.. అన్ని సినిమాలు అయిపోవాలి..

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమాతో పాటు సముద్రఖనితో వినోదయ సిత్తమ్ రీమేక్ సినిమా షూట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుగుతున్నాయి. సముద్రఖనికి............

Pawan Kalyan : ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ చేస్తున్న పవర్ స్టార్.. టార్గెట్ 2024.. అన్ని సినిమాలు అయిపోవాలి..

Pawan Kalyan doing 2 movies shoots at a time wants to complete his movie shooting by 2023 end

Pawan Kalyan :  షూటింగ్ చెయ్యడం ఒక్కో సారిలేటవ్వొచ్చేమో గానీ చెయ్యడం మాత్రం పక్కా అంటున్నారు పవర్ స్టార్. అనౌన్స్ చేసే విషయంలో స్పీడున్నా ఇన్ని రోజులు సెట్స్ మీదకెళ్లడంలో మాత్రం లేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సారి రూట్ మార్చారు. సమయం లేదు మిత్రమా అంటూ ఒకేసారి రెండు సినిమాల్ని స్టార్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఓ పక్క హరిహరవీరమల్లు షూటింగ్ కంప్లీట్ చెయ్యడానికే కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత హరీష్ శంకర్, సుజిత్, సముద్రఖని దర్శకత్వంలో సినిమాలు వరుసగా అనౌన్స్ చేసి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించేశారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమాతో పాటు సముద్రఖనితో వినోదయ సిత్తమ్ రీమేక్ సినిమా షూట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుగుతున్నాయి. సముద్రఖనికి తక్కువ డేట్స్ కావడంతో మూడు షెడ్యూల్స్ లో డేట్స్ అన్ని వరుసగా ఇచ్చేసినట్టు తెలుస్తుంది. దీంతో సముద్రఖని సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ గ్యాప్ లో అప్పుడప్పుడు హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్. రెండేళ్ల నుంచి ఈ సినిమా షూట్ సాగుతున్నా ఇంకా 70 శాతం కూడా కాలేదని ఇటీవల క్రిష్ చెప్పాడు. దీంతో ఇది లేట్ అయ్యేలా ఉందని అప్పుడప్పుడు డేట్స్ ఇస్తున్నాడు పవన్. ఈ లోపు పవన్ లేని సీన్స్ ని తీసుకుంటున్నారు క్రిష్. ఇలా ఇప్పుడు ఒకేసారి హరిహరవీరమల్లు, వినోదయసిత్తం రీమేక్ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు పవన్.

ఈ సినిమాల తర్వాత హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ని ఒకే సారి సెట్స్ మీదకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఏప్రిల్ లో సముద్రఖని సినిమా షూట్ అవ్వగానే ఈ రెండు సినిమాలకు పవన్ ఒకేసారి డేట్స్ కేటాయిస్తారని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ లో హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ ని, సుజిత్ డైరెక్ట్ చేస్తున్న గ్యాంగ్ స్టర్ ని ఒకేసారి సెట్స్ మీదకి తీసుకెళ్లి ప్యార్లల్ గా షూటింగ్ ని కంప్లీట్ చేద్దామని డిసైడ్ అయ్యారు పవన్ కళ్యాణ్.

Ajay Devgn : భోళా ట్రైలర్ రిలీజ్.. పఠాన్ లాగే కోట్లు వసూలు చేస్తుంది.. అజయ్ దేవగణ్ వ్యాఖ్యలు..

2024 లో ఎలక్షన్స్ ఉండటంతో 2023 లోనే సినిమాల షూటింగ్స్ అన్ని పూర్తి చేసి 2023 చివరికల్లా సినిమాల పరంగా ఖాళీ అయి పూర్తిగా పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టాలని పవన్ టార్గెట్. అలాగే షూట్ కంప్లీట్ చేసేస్తే పోస్ట్ ప్రొడక్షన్ లో పవన్ తో సంబంధం లేదు కాబట్టి కేవలం డబ్బింగ్ కి వెళ్లొచ్చి తన పనులు తాను చేసుకోవచ్చని పవన్ అనుకుంటున్నారు. ఇక ఇలా చేస్తే ఎలక్షన్ టైంకి ముందు కనీసం రెండు సినిమాలైనా రిలీజయి తనకు కొంచెం ప్రమోషన్ పరంగా కూడా ఉపయోగపడతాయని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్. మరి పవన్ అనుకున్నట్టు అన్ని షూట్స్ అయిపోయి వరుసగా సినిమాలు రిలీజ్ అయితే అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు.