Pawan Kalyan: వీరసింహారెడ్డి అడ్డాలో వీరమల్లు.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ప్రస్తుతం సాంగ్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. ఈ సాంగ్‌తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. దీంతో ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయనుంది. ఇక బాలయ్య సినిమాలతో పాటు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో ‘అన్‌స్టాపబుల్-2’ టాక్ షోను కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు.

Pawan Kalyan: వీరసింహారెడ్డి అడ్డాలో వీరమల్లు.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

Pawan Kalyan In The Sets Of Nandamuri Balakrishna Veera Simha Reddy

Pawan Kalyan: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ప్రస్తుతం సాంగ్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. ఈ సాంగ్‌తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. దీంతో ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయనుంది. ఇక బాలయ్య సినిమాలతో పాటు ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో ‘అన్‌స్టాపబుల్-2’ టాక్ షోను కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు.

Balakrishna : నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ కృతి సనన్ ని పెట్టుకుంటాను..

అయితే ఈ టాక్ షోకు త్వరలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రానున్నాడనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ బాలయ్య నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ చిత్ర సెట్స్‌లో సడెన్ ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ జరుపుకుంటున్న వీరిసింహారెడ్డి సెట్స్‌లో పవన్ కొద్దిసేపు సందడి చేశాడు.

Unstoppable 2: పవన్‌తో బాలయ్య అన్‌స్టాపబుల్ ముచ్చట.. ఆ రోజేనా?

దీనికి సంబంధించి ఓ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. త్వరలోనే బాలయ్యతో అన్‌స్టాపబుల్-2 స్టేజీని పంచుకునేందుకు పవన్ రెడీ అవుతున్నాడని ఈ ఫోటో మరోసారి క్లారిటీ ఇచ్చేసిందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కాగా, బాలయ్యతో పవన్ కల్యాణ్ టాక్ షోలో పాల్గొనే ఎపిసోడ్ షూటింగ్‌ను డిసెంబర్ 27న నిర్వహించేందుకు ఆహా నిర్వాహకులు రెడీ అవుతున్నారట. ఇక పవన్ తన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’కు సంబంధించి ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ఇటీవల పూర్తి చేశాడు. బాలయ్య కూడా ఈ సాంగ్ షూటింగ్‌తో ‘వీరసింహారెడ్డి’ మూవీని ఫినిష్ చేస్తాడు. ఈ ఇద్దరు కలిసి స్టేజీపై చేసే రచ్చ అన్‌స్టాపబుల్‌గా ఉండబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు.