Pawan Kalyan : అడిగినంత ఇవ్వరు.. సినిమా రెమ్యునరేషన్స్ గురించి బయటపెట్టిన పవర్ స్టార్..

ఇక సినిమాల గురించి కూడా అనేక అంశాలు మాట్లాడారు బాలయ్య-పవన్. సినిమాలకి సంబంధించిన పలు ప్రశ్నలు బాలకృష్ణ అడగగా పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చాడు. పవన్ మాట్లాడుతూ.. తొలిప్రేమ సినిమాకి రెమ్యునరేషన్ మొదట ఇవ్వలేదు. అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువయింది. కొత్త డైరెక్టర్..........................

Pawan Kalyan : అడిగినంత ఇవ్వరు.. సినిమా రెమ్యునరేషన్స్ గురించి బయటపెట్టిన పవర్ స్టార్..

Pawan Kalyan reacts on his remunerations in Unstoppable show

Pawan Kalyan :  బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీ లో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సెకండ్ సీజన్ మరింత పాపులార్ అయింది. ఇక సెకండ్ సీజన్ లో ప్రభాస్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షో దేశవ్యాప్తంగా మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఈ ఎపిసోడ్ తో సరికొత్త రికార్డులు సృష్టించింది ఈ షో. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ షూటింగ్ మొదలయిన దగ్గర్నుంచి బాలయ్య, పవన్ అభిమానులు హంగామా చేస్తూనే ఉన్నారు. బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అని పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని ఆహా ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటల నుండి స్ట్రీమింగ్ చేశారు.

పవన్ అభిమానులు, అటు బాలకృష్ణ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. రిలీజయిన కొద్దిసేపటికే చాలామంది చూసి సరికొత్త రికార్డులని సెట్ చేశారు. కొన్ని చోట్ల అభిమానులు ఈ షోని స్పెషల్ ప్రివ్యూ వేశారు. అయితే పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ మొదటి ఎపిసోడ్ లో పవన్ ఫ్యామిలీ, సినిమాలు గురించి మాట్లాడారు. ఇక రెండో ఎపిసోడ్ లో రాజకీయాలు మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. బాలయ్య – పవన్ ఎపిసోడ్ లో అనేక ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు.

Pawan Kalyan on Tej Accident : సాయిధరమ్ తేజ్ చావు దాకా వెళ్ళొచ్చాడు.. తేజ్ యాక్సిడెంట్ గురించి మాట్లాడిన పవన్..

ఇక సినిమాల గురించి కూడా అనేక అంశాలు మాట్లాడారు బాలయ్య-పవన్. సినిమాలకి సంబంధించిన పలు ప్రశ్నలు బాలకృష్ణ అడగగా పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చాడు. పవన్ మాట్లాడుతూ.. తొలిప్రేమ సినిమాకి రెమ్యునరేషన్ మొదట ఇవ్వలేదు. అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువయింది. కొత్త డైరెక్టర్, నేను కూడా అడగలేకపోయాను. సినిమా రిలీజయి హిట్ అయిన తర్వాత 100 డేస్ తర్వాత రెమ్యునరేషన్ ఇచ్చారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాకి కూడా బండ్ల గణేష్ తను అనుకున్నంత ఇచ్చాడు. నేను అనుకున్నంత ఇవ్వలేదు. రెమ్యునరేషన్ విషయంలో చాలా సినిమాలకు ఇలాగే జరిగింది అని తెలిపాడు. తమ్ముడు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాల్లో చేసినవి డూప్ చేశారా అని అడిగితే కాదు సొంతంగానే చేసి దెబ్బలు కూడా తిన్నాను అని తెలిపాడు పవన్. అలాగే రీసెంట్ టైమ్స్ లో వచ్చే డైరెక్టర్స్ చెప్పే కొన్ని కథలు రిజెక్ట్ చేస్తున్నారంట అని బాలయ్య అడిగితే పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మన ఏజ్ పెరిగింది. నా ఏజ్ కి తగ్గ క్యారెక్టర్ మాత్రమే చేస్తాను. 30 ఏళ్ళ వాడిలా చేయమంటారు కొంతమంది డైరెక్టర్స్. నేను చెయ్యలేను. సహజంగా ఉండవు చేసినా కూడా. అందుకే నా ఏజ్ కి తగని కథలు తీసుకొస్తే నో చెప్తాను అని తెలిపారు.