Bro Teaser : బ్రో టీజర్ వచ్చేసింది.. సినిమాలు ఎక్కువ చూస్తావేంట్రా నువ్వు!

పవన్, సాయి ధరమ్ తేజ్ మెగా మల్టీస్టారర్ చిత్రం ‘బ్రో’ టీజర్ వచ్చేసింది.

Bro Teaser : బ్రో టీజర్ వచ్చేసింది.. సినిమాలు ఎక్కువ చూస్తావేంట్రా నువ్వు!

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Teaser Released

Bro Movie Teaser : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలయికలో తెరకెక్కుతున్న మెగా మల్టీస్టారర్ చిత్రం ‘బ్రో’. తమిళ్ మూవీ ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా వస్తుంది. అక్కడ ఆ చిత్రాన్ని తెరకెక్కించిన సముద్రఖనినే తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల జులై 28న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ మొదలు పెట్టింది.

పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో జగన్‌లో డిప్రషన్, అది ఆయన మాటల్లోనే తెలుస్తోంది : గాదె వెంకటేశ్వరరావు

ఇప్పటికే పవన్ అండ్ తేజ్ కి సంబంధించిన పోస్టర్స్ ని రిలీజ్ చేయగా వాటికీ సూపర్ రెస్పాన్స్ వచ్చాయి. తాజాగా ఈ మూవీ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ టీజర్ డబ్బింగ్ ని కూడా పవన్ నిన్న (జూన్ 28) మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో దర్శకుడు సముద్రఖని ఆధ్వర్యంలో కంప్లీట్ చేశాడు. అనంతరం టీజర్ ని చూసి కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు ఆ టీజర్ ని చూసిన ఆడియన్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేసేలా ఉంది. మామాఅల్లుడు కలిసి ఈ జులైలో థియేటర్ లో రీ సౌండ్ చేయబోతున్నారు. కాగా ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. టీజర్ కి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది.