Pawan Kalyan : వినోదాయ సిత్తం రీమేక్ సినిమాకు పవన్ ఎంత తీసుకుంటున్నాడో చెప్పేశాడు.. 25 రోజులకు మరీ అంత ఎక్కువా ?

గతంలో కూడా చాలా సార్లు తనకు కేవలం సినిమాల ద్వారా మాత్రమే సంపాదన వస్తుందని, ఆ వచ్చిన సంపాదన కూడా పార్టీ కోసం, ప్రజల కోసమే వెచ్చిస్తున్నట్టు తెలిపాడు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు చెప్పిన మాటలతో పవన్ ప్రస్తుతం చేస్తోన్న వినోదయ సిత్తం రీమేక్ సినిమాకు దాదాపు.............

Pawan Kalyan : వినోదాయ సిత్తం రీమేక్ సినిమాకు పవన్ ఎంత తీసుకుంటున్నాడో చెప్పేశాడు.. 25 రోజులకు మరీ అంత ఎక్కువా ?

Pawan Kalyan said his remuneration for Vinodaya Sittam remake movie

Pawan Kalyan :  పవన్ కళ్యాణ్ ఓ పక్క వరుస సినిమాలతో, మరో పక్క రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రాజకీయాలకు టైం ఇస్తుండటంతో సినిమాలకు ఎక్కువ డేట్స్ కేటాయించలేకపోతున్నాడు. వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ ఉండటం, పార్టీ నడపడానికి డబ్బులు కావాల్సి రావడంతో వరుసగా సినిమాలు అయితే ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం పవన్ నాలుగు సినిమాల వర్క్ జరుగుతుంది.

హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడో స్టార్ట్ అయినా ఇంకా షూట్ దశలో ఉంది. ఇటీవలే వినోదయ సిత్తం రీమేక్ షూట్ మొదలుపెట్టాడు. ఈ సినిమాకి కేవలం 25 రోజులు మాత్రమే డేట్స్ అడగడంతో వెంటనే షూట్ కి ఒప్పుకున్నాడు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్, OG సినిమాలు కూడా త్వరలో షూట్ మొదలు కానున్నట్టు సమాచారం. ప్రస్తుతం పవన్ డబ్బుల కోసమే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే,. దీంతో పవన్ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో అని అందరూ చర్చించుకుంటున్నారు.

తాజాగా జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు తన సినిమా గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకున్నాడు అని వేరే పార్టీల నాయకులూ మాట్లాడిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. నేను సినిమాలు చేసి డబ్బులు సంపాదిస్తున్నాను. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు చేసే ఒక సినిమాకు 25 రోజులు కేటాయించాము. రోజుకు 2 కోట్లు తీసుకుంటున్నాను. సినిమాకు 50 కోట్లు తీసుకుంటున్నాను. అలా అని ప్రతి సినిమాకు ఇంతే తీసుకుంటాను అని కాదు. నాకు ఎవ్వరూ డబ్బులు ఇవ్వట్లేదు. మీరు నాకు ఇచ్చిన ప్రేమ, అభిమానమే నేను అంత రెమ్యునరేషన్ తీసుకునేలా చేశాయి. నేను చూడని డబ్బులా, సుఖాలా. నాకు డబ్బు మీద వ్యామోహం లేదు అని అన్నారు.

NTR : హైదరాబాద్‌కు చేరుకున్న ఎన్టీఆర్.. ఎయిర్‌పోర్ట్‌ వద్దకు భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్..

గతంలో కూడా చాలా సార్లు తనకు కేవలం సినిమాల ద్వారా మాత్రమే సంపాదన వస్తుందని, ఆ వచ్చిన సంపాదన కూడా పార్టీ కోసం, ప్రజల కోసమే వెచ్చిస్తున్నట్టు తెలిపాడు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు చెప్పిన మాటలతో పవన్ ప్రస్తుతం చేస్తోన్న వినోదయ సిత్తం రీమేక్ సినిమాకు దాదాపు 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే కేవలం 25 రోజులు కేటాయించి అంత రెమ్యునరేషన్ తీసుకుంటుండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక పవన్ అభిమానులు అయితే ఇదీ పవన్ రేంజ్ అని అంటున్నారు. ఒక్క వినోదయ సిత్తం సినిమాకే 50 కోట్లు అంటే మిగిలిన మూడు సినిమాలకు కూడా 50 కోట్ల చొప్పున వేసినా 200 కోట్లు పవన్ సంపాదిస్తున్నారు నాలుగు సినిమాల నుంచి. ఇంత మనీ వస్తుంది కాబట్టే పవన్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు.