Pawan Kalyan : చిన్నప్పుడు ఆ వ్యాధితో బాధపడ్డా.. అన్నయ్య రివాల్వర్ తో కాల్చుకొని చచ్చిపోదాం అనుకున్నా..

ఈ ఎపిసోడ్ లో పాలిటిక్స్ తో పాటు మరోసారి పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలని కూడా మాట్లాడారు. దీంతో పవన్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. తనకు చిన్నప్పుడు ఓ అనారోగ్యం ఉందని, దాని వాళ్ళ చాలా బాధపడ్డాడని, సూసైడ్ చేసుకుందామని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు....................

Pawan Kalyan : చిన్నప్పుడు ఆ వ్యాధితో బాధపడ్డా.. అన్నయ్య రివాల్వర్ తో కాల్చుకొని చచ్చిపోదాం అనుకున్నా..

Pawan Kalyan shares his sad past about his health and his personal views in balakrishna unstoppable show

Pawan Kalyan :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో సూపర్ గా సక్సెస్ అయింది. మొదటి సీజన్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ కూడా మరింత గ్రాండ్ గా చేశారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు ఆహా. ఈ ఎపిసోడ్ ఎక్కువ స్ట్రీమింగ్ టైం సాధించి సరికొత్త రికార్డులని సెట్ చేసింది. ఈ ఎపిసోడ్ లో సరదాగా మాట్లాడుతూ, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. తాజాగా ఫిబ్రవరి 9 గురువారం రాత్రి బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 రిలీజ్ చేశారు.

బాలయ్య-పవన్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి అటు బాలయ్య అభిమానులు, ఇటు పవన్ అభిమానులు హంగామా చేశారు. వరుసగా పోస్టర్లు, ఫోటోలు, ప్రోమోలు.. వదులుతూ ఆహా టీం కూడా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా రిలీజ్ అయిన పవన్ బాలయ్య ఎపిసోడ్ తో ఈ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. మొదటి పార్ట్ లో అంతా సినిమాలు, పర్సనల్ లైఫ్ ఉంటే రెండో పార్టీ లో చాలా వరకు పాలిటిక్స్ గురించి ఉంది. దీంతో ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఎపిసోడ్ లో పాలిటిక్స్ తో పాటు మరోసారి పవన్ కళ్యాణ్ పర్సనల్ విషయాలని కూడా మాట్లాడారు. దీంతో పవన్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. తనకు చిన్నప్పుడు ఓ అనారోగ్యం ఉందని, దాని వల్ల చాలా బాధపడ్డాడని, సూసైడ్ చేసుకుందామని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. బాలకృష్ణ చిన్నప్పటి నుంచి మొహమాటంతో, అందరికి దూరంగా, సైలెంట్ గా ఉంటూ, ఎక్కువ చదవకుండా ఉన్న నువ్వు ఇప్పుడు పవర్ స్టార్ గా ఎలా మారావు అని అడిగాడు.

దీనికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ.. నాకు చిన్నప్పుడు ఆస్తమా ఉంది. రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళలేకపోయాను. అప్పట్లో హాస్పిటల్స్ అంతగా లేవు. ఆస్తమా ఎక్కువైనప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి ఒక ఇంజెక్షన్ వేయించుకుంటే కాని సెట్ అయ్యేది కాదు. ఆ ప్రాబ్లమ్ వల్ల ఎక్కువగా ఇంటి దగ్గరే ఉండేవాడిని. స్కూల్ కి, కాలేజీకి సరిగ్గా వెళ్ళలేదు. ఖాళీగా ఉండటంతో పుస్తకాలు చదవడం మొదలుపెట్టి వాటికి అతుక్కుపోయాను. నెల్లూరులో ఉన్నప్పుడు ఓ బుక్ షాప్ అతను ఫ్రెండ్ అవ్వడంతో అతను బుక్స్ ఇచ్చాడు. నాకు ఎగ్జామ్స్ అంటే కూడా భయం. కాలేజీలో ఉన్నప్పుడు నేను అడిగే ప్రశ్నలకి టీచర్స్ కూడా సమాధానాలు చెప్పకపోవడంతో నాకు కాలేజీ కూడా నచ్చలేదు. రెగ్యులర్ గా స్కూల్ కి, కాలేజీకి వెళ్ళలేదు. సింగిల్ గానే ఎక్కువగా ఉండేవాడిని. నాలో ఆత్మన్యూనతా భావం వచ్చి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చనిపోతే బాగుండేది అని ఒక ఆలోచన వచ్చింది.

నాకు 17 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకుంట ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఎవ్వరితో కలవకుండా, ఒక్కడినే ఉండేవాడిని. అప్పుడు అన్నయ్య దగ్గర లైసెన్స్ రివాల్వర్ ఉంది. దాంతో కాల్చుకొని చనిపోదాం అనుకున్నా. అన్నయ్య షూటింగ్ కి వెళ్ళగానే అన్నయ్య రూమ్ కి వెళ్లి పిస్టల్ తీసుకొని చచ్చిపోదాం అని ఒకరోజు డిసైడ్ అయ్యాను. కాని అప్పుడే మా వదిన నన్ను గమనించి నాగబాబు అన్నయ్యకి చెప్పింది నా గురించి. అన్నయ్య షూటింగ్ కి వెళ్ళగానే అన్నయ్య రూమ్ లోకి వెళ్లి పిస్టల్ తో కాల్చుకుందాం అనుకున్నా కాని అంతలోనే మా వదిన, నాగబాబు వచ్చి పట్టుకొని ఆపారు. మా వదిన బాగా మోటివేట్ ఇచ్చింది. మా అన్నయ్యకి చెప్తే తిట్టి నువ్వేమి చేయకపోయినా పర్లేదు. ఇలాంటివి మాత్రం చేయకు అని అన్నారు. నాకు చిన్నప్పట్నుంచి కూడా ఫ్రెండ్స్ తక్కువ, ఎవరితోను నా బాధలు, ఆలోచనలు షేర్ చేసుకోలేదు. ఓ వయసుకి వచ్చాక ఇంట్లో డబ్బులు తీసుకోవడం, అమ్మానాన్నలకు ఏమి ఇవ్వలేకపోతున్నాను అని బాధపడ్డాను. దానివల్ల కూడా డిప్రెషన్ కి వెళ్లాను. ఆ తర్వాత ఇంట్లో సినిమా వాతావరణం ఉండటంతో ఇదొకటి ఉంది కదా అని, మా వదిన కూడా నన్ను మోటివేట్ చేయడంతో ఇటు వచ్చాను. కాని ఇంతలా సక్సెస్ అవుతాను అనుకోలేదు అని తెలిపాడు.

Unstoppable : 20 ఏళ్ళ తర్వాత గుంటూరు శేషేంద్ర శర్మ పుస్తకాన్ని రీ ప్రింట్ చేయించిన పవన్..

పవన్ కళ్యాణ్ ఇలా డిప్రెషన్ లో మునిగిపోయాను, చచ్చిపోదామనుకున్నాను అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మొదటిసారి పవన్ కళ్యాణ్ దీన్ని షేర్ చేసుకోవడంతో అంతా షాక్ అయ్యారు.