Pawan Kalyan : పవన్ షూటింగ్స్ కు పొలిటికల్ గ్యాప్.. ఇంకా స్పీడ్ గా సినిమాలు పూర్తి చేయాలి అంటున్న అభిమానులు..

ఇన్నాళ్లు పొలిటికల్ బిజీ వల్లే సినిమాలకు గ్యాప్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు వరుసగా సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి, త్వరలోనే సినిమా షూట్స్ అన్నీ అయిపోతాయని అనుకునేలోపు మరో పొలిటికల్ గ్యాప్ తీసుకున్నారు పవన్.

Pawan Kalyan : పవన్ షూటింగ్స్ కు పొలిటికల్ గ్యాప్.. ఇంకా స్పీడ్ గా సినిమాలు పూర్తి చేయాలి అంటున్న అభిమానులు..

Pawan Kalyan takes a political gap from movie shoots

Pawan Kalyan :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్(Elections) ఉండటంతో వాటి మీదే ఫోకస్ చేయాలని ఫిక్స్ అయ్యారు. 2024 లో ఆయన పూర్తిగా పొలిటికల్ గా బిజీ అయిపోతారు. అందుకే ఈ ఇయర్ ఎండ్ కల్లా వీలైనన్ని ఎక్కువ సినిమాల్లో నటించి వాటి షూటింగ్స్ కూడా కంప్లీట్ చేసేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ‘వినోదయ చిత్తం’(Vinodaya Sitham) తమిళ మూవీ రీమేక్ వెర్షన్ కు సంబంధించి తన పార్ట్ ను కంప్లీట్ చేశారు. మేనల్లుడు సాయిధరమ్(Sai Dharam Tej) తో స్ర్కీన్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేయ బోతున్నారు. ఈ సినిమాని జూన్ లో రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు చిత్రయూనిట్.

హరీశ్ శంకర్ డైరెక్షన్ లో ఎప్పుడో సినిమా అనౌన్స్ చేసినా వాయిదా పడుతూ వచ్చి ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టైటిల్ తో కంటిన్యూస్ షూటింగ్ జరుపుకొని రీసెంట్ గా రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఈ రోజు సినిమా నుంచి మొదటి గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. చాలా ఫాస్ట్ గా ఈ షూటింగ్ కూడా జరుగుతుంది.

ఇక సాహో’ ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ నటిస్తున్న స్టైలిష్ యాక్షన్ మూవీ ‘ఓజీ’. ఇందులో పవన్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నారు. ఈ మూవీ లేటెస్ట్ గా ఓ లాంగ్ షెడ్యూల్ షూట్ ను కంప్లీట్ చేసుకుంది. నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తుంది. OG సినిమాలో పవన్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా గత కొని రోజులుగా సినిమాలన్ని పూర్తి చేసే పనిలో పవన్ ఉండగా తాజాగా పొలిటికల్ బ్రేక్ మళ్ళీ వచ్చింది.

Custody Movie : 20 రోజులు నీళ్ళల్లోనే షూట్.. కస్టడీ సినిమాలో అదే హైలెట్..

ఇన్నాళ్లు పొలిటికల్ బిజీ వల్లే సినిమాలకు గ్యాప్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు వరుసగా సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి, త్వరలోనే సినిమా షూట్స్ అన్నీ అయిపోతాయని అనుకునేలోపు మరో పొలిటికల్ గ్యాప్ తీసుకున్నారు పవన్. ఇటీవల అకాల వర్షాలు కురవడంతో రైతన్నలు పంట నష్టపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో పవన్ తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు. అలాగే ఇన్ని రోజులు షూటింగ్స్ తో బిజీ ఉండటంతో ఇంకొన్ని రోజులు పొలిటికల్ పనులన్నీ చక్కదిద్దుకొని మళ్ళీ షూటింగ్ కి వస్తారని సమాచారం. దీంతో పొలిటికల్ గ్యాప్ తీసుకున్నా త్వరగా వచ్చి సినిమాలు పూర్తి చేయాలని అభిమానులు కోరుతున్నారు. ఎలాగైనా ఈ సంవత్సరం చేతిలో ఉన్న సినిమాలన్నీ షూటింగ్స్ పూర్తి చేసేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్.