Corn : మొక్కజొన్నలో చీడపీడలు… నివారణ

రైతులు సరైనా సస్యరక్షణ చర్యలు చేపడితే చీడపీడల భారి నుండి పంటను కాపాడుకోవచ్చు. తద్వారా మంచి దిగుబడిని పొందవచ్చు.

Corn : మొక్కజొన్నలో చీడపీడలు… నివారణ

Corn

Corn : మొక్కజొన్న నీరు సమృద్ధిగా ఉంటె అన్ని కాలాలకు అనువైన పంట .  కరిఫ్ కంటే రబీలో ఎక్కువ దిగుబడి వస్తుంది. పంట కోత మే నెల కంటే ముందే వచ్చేలా చూసుకోవాలి. అందుకే పంటను  రబీ సీజన్ లో వెయ్యడానికి రైతులు మొగ్గుచుపుతున్నారు. విత్తనం వేసేటప్పుడు సాలుల మధ్య కనీస దూరం 30-45 సే.మీ మరియు సాలు విత్తనాల మధ్య 20-25 సే.మీ దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తనంతోపాటు పైపాటుగా యూరియాను వేసుకోవాలి. ప్రధానంగా మొక్కజొన్న సాగులో చీడపీడల సమస్య అధికంగా ఉంటుంది. రైతులు సరైనా సస్యరక్షణ చర్యలు చేపడితే చీడపీడల భారి నుండి పంటను కాపాడుకోవచ్చు. తద్వారా మంచి దిగుబడిని పొందవచ్చు.

మొక్కజొన్నలో చీడపీడలు ;

కత్తెర పురుగు ; ఇది పంటకు ఆశించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. లేకుంటే కత్తెర పురుగు తక్కువ వ్యవధిలో పంట మొతాన్ని తినేస్తుంది. దీని నివారణకు 1 లీటర్ నీటిలో 5 మీ.లీ వేపనునే కలుపుకొని పిచికారి చేసుకోవాలి. లేదా 1 లీటర్ నీటిలో 3 మీ.లీ స్పెనోశాడ్ లేదా ఇమమెక్టిమ్ బెంజోయేట్ 4 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చెయ్యాలి. నివారణ కోసం రసాయన మందులను పిచికారి చేసేప్పుడు ఉదయం సమయంలో లేదా సాయంత్ర సమయాల్లో చెయ్యడం మంచిది.

కాండంతొలుచు పురుగు ; ఎక్కువగా రబీ లో దీని వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఈ పురుగు వల్ల పంట 65% వరకు దిగుబడి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పురుగు మొక్క యొక్క కాండంపై మరియు మొక్కజొన్న పొత్తులపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.5 మీ.లీ 1 లీటరు నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. కాండంతొలుచు తెగులు ఉధ్రుతి ఎక్కువగా ఉంటె కర్బోఫ్యూరాన్ త్రీజీ గుళికలను ఎకరానికి 3 కిలోలు మొక్కజొన్న ఇగురు లో వేసుకోవాలి.

పేను బంక ; మొక్కజోన్నలో పేనుబంక రసంపీల్చడం వల్ల మొక్క పెరుగుదలను దెబ్బ తీస్తుంది. పొడి వాతావరణంలో మరియు మొక్కకు నీటి ఒత్తిడి ఉన్నప్పుడు పెనుబంక ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మొక్క లేత ఆకు నుండి రసం పీల్చడం వల్ల మొక్క నిరసనగామరి ఆకులు ఆకుపచ్చ రంగు నుండి పసుపుపచ్చ రంగుకు మరుతాయి. దీని నివారణకు మోనోక్రోటోఫోస్ 1.5 మీ.లీ. లేదా డైమీతోయేట్ 2 మీ.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటరు నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి.