Sanjana : హీరోయిన్ సంజనకి అశ్లీల సందేశాలు పంపిన ఫొటోగ్రాఫర్.. అరెస్ట్

ఇటీవల సంజన ఫోన్ కి ఓ ఫోటోగ్రాఫర్ అర్ధరాత్రి సమయంలో కొన్ని అశ్లీల సందేశాల్ని పంపించాడు. సంజన దీనిపై పోలీసులకి ఫిర్యాదు చేసింది. కన్నడకి చెందిన ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఆడం బిడ్డప్ప .....

Sanjana :  హీరోయిన్ సంజనకి అశ్లీల సందేశాలు పంపిన ఫొటోగ్రాఫర్.. అరెస్ట్

Sanjana

Sanjana :  టాలీవుడ్ లో ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమాలో రెండో హీరోయిన్ గా నటించిన సంజనా గల్రాని ఆ తర్వాత కూడా తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది. కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. గతంలో సంజన డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ అయి బయటకి వచ్చింది. ఇటీవల సంజన ఫోన్ కి ఓ ఫోటోగ్రాఫర్ అర్ధరాత్రి సమయంలో కొన్ని అశ్లీల సందేశాల్ని పంపించాడు. సంజన దీనిపై పోలీసులకి ఫిర్యాదు చేసింది.

 

కన్నడకి చెందిన ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఆడం బిడ్డప్ప సంజనతో కలిసి గతంలో పని చేసాడు. వీరిద్దరి మధ్య స్నేహం కూడా ఉండేది. ఇటీవల కొన్ని కారణాలతో వీరి మధ్య విబేధాలు వచ్చాయి. అప్పటినుంచి వీరు కాంటాక్ట్ లో లేరు. ఇటీవల ఆడం సంజన ఫోన్ కి అర్ధరాత్రి సమయంలో వరుసగా అశ్లీల సందేశాలు, చిత్రాలు, వీడియోలు పంపించాడు. దీంతో సంజన పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఆ సందేశాల తీరుపై తను అభ్యంతరం కూడా చెప్పానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంజన తెలిపింది.

Rashmika Mandanna : ఇంకో జన్మ ఉంటే మగాడిగా పుట్టాలనుకుంటున్నా..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొడగులోని తన ఇంట్లో ఉన్న ఆడంను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. దీనిపై విచారించడంతో తాను సంజనకు ఎటువంటి సందేశాలు పంపించలేదని చెప్పాడు. దీంతో అతని ఫోన్ ని తీసుకొని పరిశీలించగా సంజనతో చాటింగ్‌ చేసిన ఆధారాలు లభించకపోవడంతో ఫోన్ ని ఫోరెన్సిక్‌ ప్రయోగశాలకు పంపించారు పోలీసులు. అయితే ఆడంపై గతంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.