RC15 shooting Leaks : RC15కు ఆగని లీకుల బెడద.. ఏం చెయ్యాలో తెలియక దిల్ రాజు..

RC 15 సినిమా షూటింగ్ 2021లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ మూవీకి సంబంధించి మొత్తం మూడు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. అయితే ఈ షెడ్యూల్స్ అన్నీ ఔట్ డోర్ లో షూట్ చేయడం వల్ల లీకుల సమస్య ఎక్కువైంది. ఆ మధ్య రాజమండ్రి షెడ్యూల్ లో చరణ్ నటించిన.....................

RC15 shooting Leaks : RC15కు ఆగని లీకుల బెడద.. ఏం చెయ్యాలో తెలియక దిల్ రాజు..

pics and videos leak from Ram Charan RC15 shooting goes viral

RC15 shooting Leaks :  సినిమా షూటింగ్స్ టైంలో సెట్స్ నుంచి ఫోటోలు, వీడియోలు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారతాయి. చిన్న సినిమాలకి ఇది ప్రమోషన్ లా పనికొచ్చినా పెద్ద సినిమాలకి మాత్రం నష్టమే. ఇక స్టార్ హీరోల అభిమానులు వాళ్ళ హీరో సినిమా గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఈ లీకులని ఎంకరేజ్ చేస్తుంటారు. అయితే ఇది చిత్రయూనిట్ కి మాత్రం సమస్యగా మారుతుంది. అవుట్ డోర్ లో షూట్స్ చేస్తే లీకుల బాధ ఎక్కువగా ఉంటుందని అసలు స్టార్ హీరోల సినిమాలన్నీ ఇన్ డోర్ లోనే సెట్స్ వేసుకొని షూటింగ్ జరుపుకుంటున్నాయి.

రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో లీకుల బెడద మరీ ఎక్కువైపోయింది. చిన్న బడ్జెట్ సినిమాల సంగతి అటుంచితే భారీ బడ్జెట్ మూవీస్ మేకర్స్ ఎంత జాగ్రత్త పడుతున్నా ఎవరో ఒకరు సినిమాకి సంబంధించిన ఫోటోస్ ను, వీడియోలను, ఫైట్ సీన్లను, సాంగ్స్ ను సినిమా రిలీజ్ కంటే ముందే సోషల్ మీడియాలో లీక్ చేసేస్తున్నారు. ఇప్పుడు చరణ్ సినిమా, శంకర్ కాంబో మూవీకి ఈ లీకుల తలపోటు తప్పడం లేదు.

సాధారణంగా శంకర్ సినిమాలు ఎంతో పగడ్బందీగా షూట్ జరుపుకుంటాయి. సన్నివేశాల నుంచి పిక్స్ ను, వీడియోస్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ లీక్ చేయకుండా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తుంటాడు. అయితే RC 15 మూవీ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ పూర్తి గా ఫెయిల్ అవుతోంది. ఈ సినిమా షూట్ జరుగుతున్నంత కాలం ఏదో మూల నుంచి పిక్స్ లీక్ అవుతునే ఉన్నాయి. లేటెస్ట్ గా మొదలైన షెడ్యూల్ కు కూడా ఈ తలనొప్పి తప్పలేదు.

RC 15 సినిమా షూటింగ్ 2021లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ మూవీకి సంబంధించి మొత్తం మూడు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. అయితే ఈ షెడ్యూల్స్ అన్నీ ఔట్ డోర్ లో షూట్ చేయడం వల్ల లీకుల సమస్య ఎక్కువైంది. ఆ మధ్య రాజమండ్రి షెడ్యూల్ లో చరణ్ నటించిన కీలక సన్నివేశాల్నుంచి కొన్ని ఫోటోస్ లీక్ అయ్యాయి. చరణ్ తండ్రి పాత్రకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. వాటిలో అంజలితో చెర్రీ ఉన్న ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది. ఆ తర్వాత అమృతసర్ లోని సీన్స్ కూడా లీకయ్యాయి. దీంతో షూటింగ్ చూడటానికి వచ్చిన జనం ఫోటోలు తీసి నెట్టింట పోస్ట్ చేస్తే కఠినమైన యాక్షన్ తీసుకుంటాం, ఎవరు వీటిని షేర్ చేసినా సైబర్ క్రైమ్ ద్వారా చర్యలు తీసుకుంటాం అని దిల్ రాజు సంస్థ ప్రెస్ నోట్ రిలీజ్ చెశారు. అయినా సరే ఏదో మూల నుంచి లీక్స్ వస్తునే ఉన్నాయి.

లేటెస్ట్ గా RC 15 మూవీ ఐదు ప్రధాన లొకేషన్స్ లో మాంటేజ్ సాంగ్ షూట్ జరుపుకుంది. హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి, కర్నూలులోని ల్యాండ్ మార్క్ లొకేషన్స్ లో ఆ మాంటేజ్ సాంగ్ షూట్ జరిగింది. ఈ సాంగ్ కు సంబంధించిన ప్రతీ లొకేషన్ నుంచీ లీక్స్ ఓ రేంజ్ లో వచ్చి పడ్డాయి. అంతేకాదు. ఈ పాట లిరిక్స్ కూడా కొద్దిగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. ఈ సినిమా స్టోరీ మొత్తం ఈ లీకుల కారణంగానే జనానికి తెలిసి పోయిందని మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా తన సినిమా షూట్స్ నుంచి ఒక్క లీక్ కూడా బైటికి పోనీయని శంకర్ ఈ సినిమా విషయంలో మాత్రం ఏమీ చేయలేకపోతున్నాడని కామెంట్స్ వస్తున్నాయి. మరి సినిమా రిలీజయ్యే లోపు ఇంకెన్ని లీక్స్ వస్తాయో చూడాలి.

Movie Shootings : ఏ హీరో సినిమా షూట్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?

ఇక ఈ సినిమా నిర్మాత దిల్ రాజు అయితే తలపట్టుకున్నాడు ఈ లీకుల విషయంలో. గతంలో వకీల్ సాబ్ సినిమా నుంచి ఫోటో లీక్ అయితే పెద్ద రచ్చే జరిగింది. దాంతో చాలా స్ట్రిక్ట్ గా షూట్ చేశారు. కానీ RC15 సినిమా చాలా వరకు అవుట్ డోర్ కావడంతో లీకులు వస్తున్నా దిల్ రాజు ఏమి చేయలేకపోతున్నాడు. మరి దీనికి పరిష్కారం ఏమన్నా ఆలోచిస్తాడేమో చూడాలి. ఈ విషయంలో మరోసారి దిల్ రాజు సైబర్ క్రైం కంట్రోల్ టీంని కలిసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.