PM Kisan : రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. పడ్డాయో లేదో ఇలా తెలుసుకోవచ్చు..

ఈ పథకంలో భాగంగా ఏటా రూ.6వేలు మూడు విడతల్లో(రూ.2వేలు చొప్పున) నాలుగు నెలలకోసారి కేంద్రం రైతులకు అందిస్తోంది. ఇప్పటివరకు 9 విడతల్లో నగదు ఇచ్చారు. ఇప్పుడు ప‌దో విడ‌త నిధులను..

PM Kisan : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం-కిసాన్) పథకం కింద శనివారం(జనవరి 1) రైతుల ఖాతాల్లో రూ.2వేలు జమ కానున్నాయి. ఈ మేరకు శనివారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ.. కిసాన్ నిధులను విడుదల చేస్తారని పీఎంవో తెలిపింది. ఈ పథకంలో భాగంగా ఏటా రూ.6వేలు మూడు విడతల్లో(రూ.2వేలు చొప్పున) నాలుగు నెలలకోసారి కేంద్రం రైతులకు అందిస్తోంది.

ఇప్పటివరకు 9 విడతల్లో నగదు ఇచ్చారు. ఇప్పుడు ప‌దో విడ‌త నిధులను రైతుల్లో ఖాతాల్లో జమ చేయనుంది కేంద్రం. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 10కోట్ల రైతు కుటుంబాల ఖాతాల్లో రూ.20వేల కోట్లకు పైగా సొమ్ము జమ కానుంది.

Realme XT Explode : కొన్న గంటకే పేలిన రియల్‌మి ఫోన్.. ట్విట్టర్‌లో ఫొటోలు వైరల్..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు ఆర్ధిక సాయం అందించేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని2018 డిసెంబర్ లో తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రతి ఏటా నాలుగు నెలలకు ఒకసారి రూ.2వేలు రైతు ఖాతాలో జమ చేస్తున్న విషయం మనకు తేలిసిందే. ఇప్పటి వరకు 9 సార్లు రూ.2వేల రైతు ఖాతాల్లో జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 10వ విడత నగదును జమ చేయనుంది.

అయితే, ఈ పథకానికి సంస్థాగత భూస్వాములు, ఆదాయ పన్నులు చెల్లించే వారు అర్హులు కాదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రయోజనాలను పొందడానికి, రైతులు తమ ప్రధాని కిసాన్ ఖాతాను తమ ఆధార్ కార్డులకు లింక్ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్ తో లింకు చేసిన వారికి మాత్రమే పీఎం కిసాన్ 10వ విడత నగదు జమ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఒకవేళ తప్పుడు ఆధార్ వివరాలు అందించినట్లయితే, ఆ రైతుకు రూ.2వేలు లభించవు.

Whatsapp 3 Tick : వాట్సాప్‌లో మూడో బ్లూ టిక్‌.. ఆ వార్త ఫేక్..!

డబ్బులు జమ కావాలంటే..
* రైతులు ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ కార్డును లింక్ చేశారో ఆ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాలి.
* అక్కడ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీపై సంతకం చేసి బ్యాంకు సిబ్బందికి ఇవ్వాలి.
* మీ ఆధార్ వివరాలు వెరిఫై చేసిన తర్వాత ఆధార్- ప్రధాని కిసాన్ ఖాతాతో లింక్ అవుతుంది.
* లింక్ అయిన తర్వాత ఎస్ఎంఎస్ వస్తుంది.

* రైతులు తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లో కూడా తెలుసుకోవచ్చు.
* వెబ్‌సైట్ ఓపెన్ చేశాక Farmers Corner సెక్షన్‌లో Edit Aadhaar Failure Records పైన క్లిక్ చేయాలి.
* ఆధార్ నెంబర్, అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫార్మర్ నేమ్‌లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయాలి.
* ఆ తర్వాత రైతు పేరు, తండ్రి పేరు, జెండర్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, సబ్ డిస్ట్రిక్ట్ పేరు, బ్లాక్ పేరు, ఊరి పేరు లాంటివన్నీ సరి చూసుకోవాలి.
* అన్నీ కరెక్ట్‌గా ఉంటే పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి.
* వివరాల్లో తప్పులు ఉంటే Edit పైన క్లిక్ చేసి సరిచేసుకోవచ్చు.

డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి…
* పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్ సైట్ కి (pmkisan.gov.in.) వెళ్లాలి.
* బెనిఫీషియర్ స్టేటస్ పై క్లిక్ చేయాలి.
* ఆధార్ నెంబర్, అకౌంట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్.. ఇందులో ఏదో ఒక ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
* ఆప్షన్ ఎంచుకున్నాక గెట్ డేటాపై క్లిక్ చేయాలి.
* పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ లేదా గూగుల్ ప్లే స్టోర్/యాప్ స్టోర్ నుంచి పీఎం కిసాన్ మొబైల్ అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు