Pooja hegde : బాలీవుడ్ లో కూడా హిట్ కొడతానంటున్న బుట్టబొమ్మ..

టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ రేసులో పూజాహెగ్డే దూసుకపోతోంది. సౌత్ ఇండియాలో స్టార్లందరి ఫేవరేట్ హీరోయిన్ పూజానే. అయితే, బాలీవుడ్ లో మాత్రం...............

Pooja hegde : బాలీవుడ్ లో కూడా హిట్ కొడతానంటున్న బుట్టబొమ్మ..

Pooja Hegde

Pooja hegde :  టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ రేసులో పూజాహెగ్డే దూసుకపోతోంది. సౌత్ ఇండియాలో స్టార్లందరి ఫేవరేట్ హీరోయిన్ పూజానే. అయితే, బాలీవుడ్ లో మాత్రం ఆమెకు టైమ్ కలసి రాలేదు. ఈ సారి బాలీవుడ్ లో కూడా పక్కాగా హిట్ కొడాతనుంటుంది పూజా హెగ్డే.

టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ పూజాహెగ్డే. ఇప్పుడు తెలుగు, తమిళ స్టార్స్ పక్కన వరస ఛాన్స్ లు కొట్టేస్తూ సత్తా చాటుతోంది. వరసగా ఫ్లాపులొచ్చినా ఆ ప్రభావం తన మీద ఏమాత్రం పడటం లేదు. స్టార్స్ మాత్రం పూజా హెగ్డేనే ఏరి కోరి తమ సినిమాల్లోకి తీసకుంటున్నారు. నార్త్ లోనూ బిగ్ హిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది పూజా. ప్రస్తుతం బాలీవుడ్ లో సర్కస్, కబీఈద్ కబీ దివాళి రెండు బిగ్ ప్రాజెక్టులు చేస్తోంది.

Movie Shootings : సినీ కార్మికుల సమ్మెతో స్టార్ హీరోల సినిమాలకి ఎఫెక్ట్..

ఆల్రెడీ 2016లోనే మొహెంజదారోతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బుట్టబొమ్మను సక్సెస్ పలకరించలేదు. ఆ తర్వాత 2019లోనూ ట్రై చేసినా హౌస్ ఫుల్ 4 కూడా జిగేల్ రాణికి కలిసి రాలేదు. పాన్ ఇండియా రేంజ్ లో ముఖ్యంగా నార్త్ లో ఎన్నో ఆశలు పెట్టుకున్న రాధేశ్యామ్ కూడా ప్రేరణకు నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ పాగా వేయాలని చూస్తున్న పూజాను బిగ్ సక్సెస్ ఊరిస్తోంది.

బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారాలని చూస్తోన్న పూజాహెగ్డే చేతిలో ఇప్పుడు రెండు బిగ్ ప్రాజెక్టులున్నాయి. ఒకటి రణవీర్ సింగ్ తో చేసిన సర్కస్. అవుట్ అండ్ అవుట్ కామెడి ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. డిసెంబర్ 23న ఈ సినిమా రిలీజ్ కానుంది. మరో సినిమా సల్మాన్ ఖాన్ కాంబోలో రాబోతున్న కబీఈద్ కబీ దివాళి. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఈద్ స్పెషల్ గా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా పూజాకు భారీ విజయాన్నందించి బాలీవుడ్ లో బ్రేక్ ఇస్తుందో చూడాలి.