Pooja Hegde : ఆధ్యాత్మిక యాత్రలో బుట్టబొమ్మ

నిత్యం షూటింగ్‌ బిజీలో ఉండే తారలు ఇలా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లి కొన్ని రోజులు ప్రశాంత వాతావరణంలో గడిపి వస్తారు. మన బుట్టబొమ్మ పూజ హెగ్డే వరుస సినిమాలతో చాలా బిజీగా

Pooja Hegde : ఆధ్యాత్మిక యాత్రలో బుట్టబొమ్మ

Pooja

Pooja Hegde :  మన సినీ సెలబ్రిటీలు ఎప్పుడూ షూట్స్ తో బిజీగా ఉంటారు. వారి షెడ్యూల్ లో కొంచెం ఖాళి దొరికినా విదేశాల్లో విహార యాత్రలకి చెక్కేస్తూ ఉంటారు. చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు ఖాళీ సమయం దొరికితే వేరే దేశాలకి పయనం అవుతారు. కొంతమంది అయితే మన దేశంలోనే మంచి ప్లేసులు చూసుకొని వెళ్తూ ఉంటారు. ఎక్కువగా ఎంజాయ్ చేయడానికే వెళ్తారు. చాలా తక్కువ మంది సెలబ్రిటీలు మాత్రం గుళ్ళు, గోపురాలకు వెళ్తూ ఉంటారు. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు కొంతమంది సెలబ్రిటీలు.

Yuvaraj Biopic : క్రికెటర్ యువరాజ్ బయోపిక్.. కొత్త హీరోతో ప్రయోగం..

ఆధ్యాత్మిక యాత్రలు మనసుకి ఎంతో ప్రశాంతత చేకూరుస్తుందని మనకి తెలుసు. నిత్యం షూటింగ్‌ బిజీలో ఉండే తారలు ఇలా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లి కొన్ని రోజులు ప్రశాంత వాతావరణంలో గడిపి వస్తారు. మన బుట్టబొమ్మ పూజ హెగ్డే వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా తన హవా నడుస్తుంది. షూటింగ్స్ తో బిజీగా ఉండే పూజాహెగ్డే ఇటీవల ఖాళీ సమయం దొరకగానే వారణాసిని సందర్శించింది. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పవిత్ర గంగా తీరంలో ఒక్కరోజు గడపడం హృదయానికి సాంత్వన చేకూర్చిందని, గంగాహారతిలో పాల్గొనడం దివ్యమైన అనుభవమని, నా సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. విజయాన్ని కాంక్షిస్తూ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు తీసుకున్నా. అందరికి శుభం కలగాలని కోరుకున్నా అని పూజాహెగ్డే పోస్ట్ చేసింది. అభిమానులు, నెటిజన్లు మన బుట్టబొమ్మకి దైవ భక్తి కూడా ఎక్కువే అని ఆమె పోస్టులకి కామెంట్స్ పెడుతున్నారు.