Prabhas 25 : క్రేజీ కాంబో.. డార్లింగ్‌తో సందీప్ ‘స్పిరిట్’..

ప్రభాస్ 25వ సినిమా ‘స్పిరిట్’ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చెయ్యనున్నట్లు ప్రకటించారు..

Prabhas 25 : క్రేజీ కాంబో.. డార్లింగ్‌తో సందీప్ ‘స్పిరిట్’..

Prabhas

Prabhas 25: ‘బాహుబలి’ తో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు రెబల్ స్టార్ ప్రభాస్.. వరుసగా క్రేజీ ప్రాజెక్టులు లైనప్ చేస్తున్నాడు. ‘రాధే శ్యామ్’ రిలీజ్‌కి రెడీ అవుతుండగా.. ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ – K’ (వర్కింగ్ టైటిల్) సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

ChaySam : నాగ చైతన్యను గ్రూపులో యాడ్ చేసిన ప్రభాస్

ఇక డార్లింగ్ కెరీర్‌లో 25వ సినిమాను గురువారం అనౌన్స్ చేశారు. ‘అర్జున్ రెడ్డి’ తో తెలుగు సినీ పరిశ్రమ చూపు తన వైపు తిప్పుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ 25వ సినిమా చెయ్యబోతున్నారు.

Release Clash : ప్రభాస్‏తో అక్షయ్ కుమార్ పోటీ..

ఈ క్రేజీ ఫిలింకి ‘స్పిరిట్’ అనే సాలిడ్ టైటిల్ ఫిక్స్ చేశారు. టీ-సిరీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. వంగా పిక్చర్స్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తుంది. పాన్ ఇండియాను మించి దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ అవగానే ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)