Adipurush : ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్‌కి రంగం సిద్ధం.. స్పెషల్ స్క్రీనింగ్ థియేటర్ లిస్ట్ ఇదే..

ప్రభాస్ ఆదిపురుష్ ట్రైలర్ ఈ నెల 9న రిలీజ్ కాబోతుంది. ఈ ట్రైలర్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్ లో ప్రదర్శించనున్నారు. ఆ థియేటర్స్ లిస్ట్ ఇదే..

Adipurush : ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్‌కి రంగం సిద్ధం.. స్పెషల్ స్క్రీనింగ్ థియేటర్ లిస్ట్ ఇదే..

Prabhas Adipurush 3D trailer premier theaters list

Adipurush : ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon) సీతగా కనిపిస్తూ చేస్తున్న మైథిలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఈ చిత్రం.. గ్రాఫిక్స్ విషయంలో విమర్శలు ఎదురుకోవడంతో రీ వర్క్ కోసం వెనక్కి వెళ్లారు. ఇప్పుడు జూన్ 16న రిలీజ్ కి సిద్దమవుతుండడంతో మూవీ ట్రైలర్ విడుదల చేస్తే గ్రాఫిక్స్ లో జరిగిన చేంజ్స్ చూసేందుకు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.

Adipurush: నెల రోజుల ముందే ట్రైలర్.. ఆదిపురుష్ రిస్క్ చేస్తున్నాడా..?

ఇక ఈ ట్రైలర్ ని ఈ నెల 9వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మూవీ టీం రెడీ అవుతుంది. 2D అండ్ 3D ఫార్మట్స్ లో ఈ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. 3D ట్రైలర్ ని పలు ప్రాంతాల్లో సెలెక్ట్ చేసిన కొన్ని థియేటర్ లో ప్రదర్శించనున్నారు. తాజాగా ఆ థియేటర్ లిస్ట్ ని అనౌన్స్ చేశారు. హైదరాబాద్ లో సుదర్శన్ 35MM, అత్తాపూర్ SVC, ఈశ్వర్. విజయవాడలో G3 అండ్ అలంకార. వైజాగ్ లో కిన్నెరా,కామేశ్వరి, జగదాంబ. గుంటూరు భాస్కర్, ఒంగోలు సత్యం, తిరుపతి PGR థియేటర్ లతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఈ 3D ట్రైలర్ ని ప్రదర్శించనున్నారు. అలాగే చెన్నైలో కూడా సత్యం అండ్ VR మాల్ లో ఆదిపురుష్ ట్రైలర్ ప్రీమియర్ వేయనున్నారు.

Prabhas – Anushka : ప్రభాస్‌ని అనుష్క ఎలాంటి ముద్దు పేరుతో పిలుస్తుందో తెలుసా.. పోస్ట్ వైరల్!

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ రిలీజ్ కి ముందే ట్రిబెకా ఫెస్టివల్ (Tribeca Film Festival) లో ప్రీమియర్ కానుంది. జూన్ 7 నుంచి 18 వరకు జరగబోయే ఈ ఫిలిం ఫెస్టివల్ లో ఆదిపురుష్ ని జూన్ 13, 14, 15 తేదీల్లో ప్రదర్శించనున్నారు. ఆ తరువాత రోజు జూన్ 16న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.