Radhe Shyam: పేరుకే డార్లింగ్.. కానీ రొమాన్స్ మాత్రం కష్టం!

రాధేశ్యామ్ నాన్ స్టాప్ ప్రమోషన్స్ లో ప్రభాస్, పూజా హెగ్డే ఫుల్ బిజీగా ఉన్నారు. రోజురోజుకీ ఏదో ఒక కొత్త విషయం బయట పెడుతూ సినిమా పై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. ఈ సినిమా కోసం..

Radhe Shyam: పేరుకే డార్లింగ్.. కానీ రొమాన్స్ మాత్రం కష్టం!

Radhe Shyam

Radhe Shyam: రాధేశ్యామ్ నాన్ స్టాప్ ప్రమోషన్స్ లో ప్రభాస్, పూజా హెగ్డే ఫుల్ బిజీగా ఉన్నారు. రోజురోజుకీ ఏదో ఒక కొత్త విషయం బయట పెడుతూ సినిమా పై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. ఈ సినిమా కోసం టీమ్ ఎంత కష్టపడ్డారో రీసెంట్ గా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. కాని, ప్రభాస్ మాత్రం మరో విషయంలో కష్టపడ్డాడట. ఆయణ్ని ఇబ్బంది పెట్టిన ఆ ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ పై ఓ లుక్కేద్దాం.

Radhe Shyam: టైటానిక్‌ను మించి.. రాధేశ్యామ్ క్లైమాక్స్ రచ్చ!

రాధేశ్యామ్ ప్రమోషన్లో వరసగా ఇచ్చే అప్ డేట్స్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రీసెంట్ గా మెటావర్స్ లో ట్రయిలర్ రిలీజ్ చేసి, వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ అయ్యింది ఈ సినిమా టీమ్. లేటెస్ట్ గా వచ్చిన మేకింగ్ వీడియోకైతే వరల్డ్ వైడ్ ఆడియన్స్ సర్ ప్రైజ్ ఫీలయ్యారు. 3 నిమిషాల మేకింగ్ వీడియోలో ఈ సినిమాను ఎంత కష్టపడి రూపొందించారో చూపించారు. యూరప్ లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో మంచు ప్రాంతాల్లో చాలా కష్టపడ్డారు ఈ సినిమా టీమ్.

Radhe Shyam: ఆయనకు సిగ్గెక్కువ.. ప్రభాస్‌తో కెమిస్టీపై పూజా!

కరోనా కారణంగా అక్కడ షూటింగ్ ఆగిపోవడంతో ఇండియాలోనే ఇటలీ సెట్ వేశారు. 1970 నాటి ఇటలీని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమా మేకింగ్ వీడియో వచ్చాక ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అని ఫీలవుతుంటే, ప్రభాస్ మాత్రం తనను కష్టపెట్టిన ఎలిమెంట్ మరొకటుందని చెప్పి ఫాన్స్ కు షాకిచ్చాడు. ప్రభాస్ కు సినిమాల్లో అతి కష్టమైంది రొమాన్స్ అట. ఈ సినిమాలో పూజా హెగ్డేతో రొమాన్స్ చేయడానికి ఎంత కష్టపడ్డాడో క్లారిటీ ఇచ్చాడు డార్లింగ్.

Radhe Shyam: చల్లారని కోల్డ్ వార్.. ఎడమొహం పెడమొహంగా ప్రభాస్-పూజా?

ముందు నుంచీ ముద్దు సీన్లంటే ప్రభాస్ చాలా సిగ్గు పడేవాడట. ఈ సినిమా స్టోరీ డిమాండ్ చేయడంతో తప్పక చేయాల్సి వచ్చిందన్నాడు. గతంలో కమర్షియల్ సినిమాల్లో మాస్ యాక్షన్ ఎపీసోడ్స్ ఉంటాయి కనుక ఎలాగోలా తప్పించుకునే ఛాన్స్ ఉంది. కాని, ఈ సినిమానే పూర్తి స్తాయి లవ్ స్టోరీ కావడంతో చేయక తప్పలేదు. పూజా హెగ్డేతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడానికి తెగ ఇబ్బంది పడ్డానని ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు గ్లోబల్ స్టార్. ఈ సీన్స్ చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్టర్ కి చెప్పి, షూటింగ్ స్పాట్ లో జనం లేకుండా చూసుకుని చేశానని క్లారిటీ ఇచ్చాడు. అంతే కాదు షర్ట్ లేకుండా కూడా కొంతమంది ముందు చేయలేకపోయాడట డార్లింగ్.