Prabhas : అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో ప్రభాస్ స్పెషల్ ఫిలిం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'బాహుబలి' కి, 'సాహో' సినిమాలకి ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఈ రెండు సినిమాలకే దాదాపు 7 సంవత్సారాలు పట్టింది. ఇకపై సినిమాలు ఇంత లేట్ గా చేయకూడదు ఫాస్ట్ గా

Prabhas :  అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో ప్రభాస్ స్పెషల్ ఫిలిం

Prabhas

Prabhas :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ కి, ‘సాహో’ సినిమాలకి ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఈ రెండు సినిమాలకే దాదాపు 7 సంవత్సారాలు పట్టింది. ఇకపై సినిమాలు ఇంత లేట్ గా చేయకూడదు ఫాస్ట్ గా చేయాలి అని ఫిక్స్ అయ్యాడు ప్రభాస్. అందుకే ‘సాహో’ తరువాత వరుసగా సినిమాలని అనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే ‘సాహో’ తర్వాత తన నెక్స్ట్ 5 సినిమాలని అనౌన్స్ చేసాడు. ప్రభాస్ కెరీర్ లో ‘సాహో’ 19వ సినిమా కాగా, ‘రాధేశ్యామ్’ 20వ సినిమా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాబోతున్న ‘సలార్’ 21వ సినిమా, బాలీవుడ్ లో చేయబోతున్న ‘ఆదిపురుష్’ 22వ సినిమా, నాగ్ అశ్విన్ తో 23వ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే 24వ సినిమాను సిద్దార్థ్ ఆనంద్‌తో చేయనున్నట్టు అనౌన్స్ కూడా చేసాడు.

BiggBoss 5 : షన్నుకి షాక్ ఇచ్చిన కంటెస్టెంట్స్ .. ఈ వీక్ నామినేషన్స్ లో ఎవరున్నారో తెలుసా??

ఇన్ని సినిమాలని లైన్ లో పెట్టాడు ఒకే సారి. ఇప్పటికే ‘రాధేశ్యామ్’ షూట్ ని కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. తాజాగా తన 25వ సినిమాని కూడా అనౌన్స్ చేయబోతున్నాడు ప్రభాస్. ఇప్పటి హీరోల కెరీర్ లో 25వ సినిమా అంటే ఒక మైలు రాయి. అలాంటి స్పెషల్ ఫిలింని స్పెషల్ గా ప్లాన్ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. ఈ నెల 7న ఈ సినిమాను ప్రకటించబోతున్నాడు. ఈ సినిమాని ఏ దర్శకుడితో ఏ బ్యానర్‌లో చేయబోతున్నాడో 7వ తేదీన ప్రకటించనున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ప్రభాస్ తన 25వ సినిమాని ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ వంగాతో చేయనున్నాడు అని సమాచారం. సందీప్ ‘అర్జున్ రెడ్డి’ తర్వాత బాలీవుడ్ లో దాన్ని రీమేక్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇటీవల ప్రభాస్ కి ఒక థ్రిల్లర్ కాన్సెప్ట్ చెప్పాడని ప్రభాస్ కి నచ్చడంతో ఓకే చేసాడని సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే ప్రభాస్ నుంచి మంచి ఇంటెన్స్ ఉన్న సినిమా రాబోతున్నట్టే. ఈ సినిమా డీటెయిల్స్ కోసం వెయిట్ చేయాలి అంటే 7వ తేదీ వరకు ఆగాల్సిందే.