Project K  : ప్రాజెక్ట్ K గ్లింప్స్, టైటిల్ రిలీజ్.. కలియుగాంతం దేవుడు కల్కి వచ్చేశాడు..

తాజాగా హాలీవుడ్ కామిక్ కాన్ ఈవెంట్ నుంచి ప్రాజెక్ట్ K టైటిల్ , గ్లింప్స్ రిలీజ్ చేశారు. సినిమాకు టైటిల్ చాలా మంది ఊహించినట్టే కల్కి అని పెట్టారు.

Project K  : ప్రాజెక్ట్ K గ్లింప్స్, టైటిల్ రిలీజ్.. కలియుగాంతం దేవుడు కల్కి వచ్చేశాడు..

Prabhas Project K Movie Title Released in Comic Con Event

Project K Movie : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొనబోయే మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ K సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ కార్యక్రమానికి దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్ పాల్గొన్నారు.

నిన్న ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానులకి సర్ ప్రైజ్ ఇచ్చిన చిత్రయూనిట్ తాజాగా హాలీవుడ్ కామిక్ కాన్ ఈవెంట్ నుంచి ప్రాజెక్ట్ K టైటిల్ , గ్లింప్స్ రిలీజ్ చేశారు. సినిమాకు టైటిల్ చాలా మంది ఊహించినట్టే కల్కి అని పెట్టారు. ఇక సినిమా టైటిల్ కింద 2898 AD అని పెట్టారు. అంటే కలియుగాంతం చివర్లో ఆ సంవత్సరంలో జరిగే కథ అని తెలుస్తుంది.

ప్రపంచాన్ని చీకటి కమ్ముకున్నప్పుడు ఒక వెలుగు వస్తుంది అని, ప్రపంచాన్ని విలన్ తన గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు కల్కి ఉద్భవిస్తాడని, ప్రజల్ని కాపాడతాడని ఈ గ్లింప్స్ బట్టి తెలుస్తుంది. ఈ గ్లింప్స్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఒక్కసారిగా ప్రాజెక్ట్ K సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. కచ్చితంగా ఈ సారి హాలీవుడ్ టార్గెట్ గా నాగ్ అశ్విన్ గట్టిగానే ఏదో ప్లాన్ చేశాడని అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాని వచ్చే సంవత్సరం రిలీజ్ చేయనున్నారు.