Prabhas – Raviteja : సంక్రాంతి బరిలో రెండు యాక్షన్ థ్రిల్లర్స్.. ప్రభాస్ అండ్ రవితేజల్లో ఎవరు గెలుస్తారు..?

టాలీవుడ్ లో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రవితేజ అండ్ ప్రభాస్ యాక్షన్ సినిమాలతో పోటీ పడబోతున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు..?

Prabhas – Raviteja : సంక్రాంతి బరిలో రెండు యాక్షన్ థ్రిల్లర్స్.. ప్రభాస్ అండ్ రవితేజల్లో ఎవరు గెలుస్తారు..?

Prabhas Project K Raviteja Eagle movies released in sankranti 2024

Prabhas – Raviteja : టాలీవుడ్ లో వచ్చే ఏడాది (2024) సంక్రాంతికి గట్టి పొట్టి ఉండబోతుంది. తెలుగు స్టార్ హీరోలు అయిన రవితేజ, మహేష్ బాబు (Mahesh Babu), ప్రభాస్.. తమ సినిమాలతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నారు. అయితే వీరిలో మహేష్ గుంటూరు కారం (Guntur Karam) అంటూ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇక రవితేజ అండ్ ప్రభాస్.. ఇద్దరు యాక్షన్ థ్రిల్లర్స్ తో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

B V S N Prasad : నాడు ప్రజారాజ్యం.. నేడు జనసేన.. సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌కి పవన్ ఆహ్వానం!

ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రాజెక్ట్ K (Project K) సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ గా ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. తాజాగా రవితేజ తన కొత్త సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ.. మూవీ రిలీజ్ ని కూడా కన్‌ఫార్మ్ చేశాడు. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేనిని దర్శకుడు పరిచయం చేస్తూ ఈగల్ (Eagle) అనే సినిమాని తీసుకు వస్తున్నాడు.

Manoj Manchu : ఆదిపురుష్ సినిమాని వారికి ఫ్రీగా చూపిస్తానంటున్న‌ మంచు మ‌నోజ్.. ఎవ‌రికో తెలుసా..?

ఈ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ చూస్తుంటే.. ఈ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుందని తెలుస్తుంది. టీజర్ లో చూపించిన యాక్షన్ షాట్స్ హాలీవుడ్ యాక్షన్ మూవీ రేంజ్ లో కనిపించాయి. దీంతో యాక్షన్ మూవీ లవర్స్ లో ఈ సినిమా పై క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. ఇక ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. ప్రాజెక్ట్ K తో పాటు ఈగల్ కూడా యాక్షన్ కంటెంట్ తో వస్తుండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద రెండు సినిమాల మధ్య గట్టి పోటీ కనిపించవచ్చు అంటున్నారు. మరి పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? లేకపోతే రవితేజ అండ్ ప్రభాస్ లో ఎవరు గెలుస్తారో? చూడాలి.