Salaar : RCB పై సలార్ మూవీ టీం ట్వీట్..

ప్రభాస్ (Prabhas) సలార్.. టీం RCB (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) పై వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఆ ట్వీట్ ఏంటో తెలుసా?

Salaar : RCB పై సలార్ మూవీ టీం ట్వీట్..

Prabhas Salaar team tweet on RCB team Virat Kohli - Pic Source Google

Salaar : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ (Salaar). కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండడంతో మూవీ పై భారీ హైప్ నెలకుంది. శృతి హాసన్ (Shruti Haasan) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ లు బట్టి ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుంది అంటూ అర్ధమవుతుంది. తాజాగా సలార్ టీం RCB క్రికెట్ టీంని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేసింది.

Salaar : పాన్ వరల్డ్ సినిమాగా రాబోతున్న సలార్.. నిజమేనా?

”మైండ్ బ్లోయింగ్ యాక్షన్ తో ది మోస్ట్ వైలెంట్ మ్యాన్ సలార్ సెప్టెంబర్ 28న వచ్చేస్తున్నాడు. హలో RCB (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) ఈ ఏడాది మీరు కూడా రెబల్ మోడ్ ని బయట పెట్టండి” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. సలార్ చిత్రాన్ని కన్నడ నిర్మాతలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే IPL లో తమ హోమ్ టీం ని సపోర్ట్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు. మరి ఇప్పటి వరకు కప్ కొట్టని RCB ఈ ఏడాది అయిన టైటిల్ ని అందుకుంటుందా లేదా చూడాలి.

ఇక సలార్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ మూవీ ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుంది. జేమ్స్ బాండ్ సినిమా తెరకెక్కించిన లొకేషన్ లో ప్రభాస్ పై యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నాడు ప్రశాంత్ నీల్. రవి బస్రుర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. కాగా ప్రభాస్ నటించిన మరో చిత్రం ఆదిపురుష్ (Adipurush) జూన్ లో రిలీజ్ కి సిద్దమవుతుంది. రామాయణం బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా కనిపించబోతున్నారు.