Prashanth Neel : కిక్కులో కిక్కెక్కే కథలు రాస్తాడు

ప్రశాంత్ నీల్ సమాధానమిస్తూ..''నేను మందు తాగుతాను. మందు తాగుతూనే కథలు రాస్తాను. అలా మత్తులో ఉన్నప్పుడు కూడా సినిమాలో సన్నివేశాల గురించి ఆలోచిస్తాను. సినిమాకు కథ.....

Prashanth Neel : కిక్కులో కిక్కెక్కే కథలు రాస్తాడు

Prashanth

Prashanth Neel :  గత మూడు రోజులుగా ఎక్కడ చూసినా ‘కేజిఎఫ్ 2’ నామస్మరణే కనిపిస్తుంది. ‘కేజిఎఫ్ 1’ వచ్చిన మూడు సంవత్సరాలకి ‘కేజిఎఫ్ 2’ రావడంతో ఇప్పటికే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న సినీ ప్రేమికులంతా థియేటర్లకు పరుగులు తీశారు. సినిమా మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. కలెక్షన్లు కూడా కొల్లగొడుతుంది. ఇక సినిమా చూసిన వారంతా ఆ ఎలివేషన్స్ చూసి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని ఆకాశానికెత్తేస్తున్నారు.

Ram Charan : పంజాబ్ లో RC15 షూట్.. RRR ఎఫెక్ట్.. చరణ్‌తో ఫోటోల కోసం పంజాబ్ పోలీసుల క్యూ..

అయితే ఇటీవల రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేశాడు. ఇంటర్వ్యూలో యాంకర్.. సర్ మీరు ఇలాంటి ఎలివేషన్స్ తో ఇంత హైగా స్టోరీలు ఎలా రాస్తారు అని అడిగారు. దీనికి ప్రశాంత్ నీల్ సమాధానమిస్తూ..”నేను మందు తాగుతాను. మందు తాగుతూనే కథలు రాస్తాను. అలా మత్తులో ఉన్నప్పుడు కూడా సినిమాలో సన్నివేశాల గురించి ఆలోచిస్తాను. సినిమాకు కథ ముఖ్యం కాదు. దాన్ని ఎలా ప్రెజెంట్ చేశామన్నది ముఖ్యం. కథ రాసేటప్పుడు ఫుల్ గా తాగి రాస్తాను. అయితే ఆ మత్తు దిగిన తర్వాత అప్పుడు రాసిన సీన్స్ అంతా చదువుతాను. ఆ కిక్కు దిగాక కూడా ఆ కథలో, సీన్స్ లో అంతే హై కనిపిస్తేనే, దాన్ని సినిమాగా తీస్తాను” అని చెప్పి షాకిచ్చారు. ఈ సమాధానం విని అంతా ఆశ్చర్యపోయారు. అంటే ఈ కేజిఎఫ్ కూడా మత్తులోనే ఉండి రాశారన్నమాట అని అనుకుంటున్నారు. కిక్కులో ఉంటే ఇలాంటి కిక్కెక్కించే కథలు రాస్తాడన్నమాట ప్రశాంత్ నీల్.