Ram Charan : బ్రాడ్ పిట్ గురించి నాకు తెలియదు.. కానీ రామ్‌చరణ్ మాత్రం.. ప్రియాంక చోప్రా!

ప్రియాంక చోప్రా ఇటీవల ఒక అమెరికన్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Ram Charan : బ్రాడ్ పిట్ గురించి నాకు తెలియదు.. కానీ రామ్‌చరణ్ మాత్రం.. ప్రియాంక చోప్రా!

Priyanka Chopra comments on ram charan in american interview

Ram Charan – Priyanka Chopra : ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ చెక్కేసి అక్కడే సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ హీరోయిన్ సిటాడెల్ (Citadel) అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇక ఆ ప్రమోషన్స్ లో ఉన్న ప్రియాంక వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. RRR లో రామ్ చరణ్ ని చూసిన హాలీవుడ్ ప్రేక్షకులు.. చరణ్ ని ఇండియన్ బ్రాడ్ పిట్ (Brad Pitt) అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

Hrithik Roshan : ప్రియాంక చోప్రా నువ్వు అదరగొట్టేశావ్.. హృతిక్ రోషన్ పోస్ట్ వైరల్!

తాజాగా ఆ విషయం గురించి ప్రియాంకతో మాట్లాడుతూ.. “ఆ కామెంట్ ని మీరు ఒప్పుకుంటారా?” అని ప్రశ్నించారు. దానికి ప్రియాంక బదులిస్తూ.. “కచ్చితంగా ఒప్పుకుంటాను. రామ్ లో ఒక చరిష్మా ఉంది. బ్రాడ్ పిట్ గురించి నాకు తెలియదు గాని, రామ్ చరణ్ మాత్రం చాలా నైస్” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ప్రియాంక అండ్ చరణ్ జంజీర్ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.

Ram Charan : ముంబైలో 1000 మంది రామ్‌చరణ్‌ ఫ్యాన్స్.. దాదాపు తొమ్మిది వేల మందికి సేవ!

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చెంజర్ (Game Changer) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ మూవీకి మరో తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తున్నాడు. కియారా అద్వానీ (Kiara Advani) చరణ్ కి జోడిగా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by @i_am_a_charanfangirl