Priyanka Chopra : మదర్స్ డే రోజూ కూతుర్ని పరిచయం చేసిన ప్రియాంక చోప్రా

ఇటీవలే సరోగసి ద్వారా ఒక పాపకి జన్మనిచ్చింది ప్రియాంక చోప్రా. తాజగా తన భర్త, తన పాపతో కలిసి ఉన్న ఫోటోని మదర్స్ డే రోజూ ఎమోషనల్ పోస్ట్............

Priyanka Chopra : మదర్స్ డే రోజూ కూతుర్ని పరిచయం చేసిన ప్రియాంక చోప్రా

Priyanka

Priyanka Chopra :  మదర్స్ డే సందర్భంగా కాజల్ అగర్వాల్ తన బాబుని మొదటిసారి సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మరో హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా తన పాపని మొదటిసారి అభిమానులకి పరిచయం చేసింది. ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెట్ అయి వరుస సినిమాలు చేస్తూ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయింది. ఇక ఇటీవలే సరోగసి ద్వారా ఒక పాపకి జన్మనిచ్చింది ప్రియాంక చోప్రా. తాజగా తన భర్త, తన పాపతో కలిసి ఉన్న ఫోటోని మదర్స్ డే రోజూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

తన కూతురితో ఉన్న ఫోటో షేర్ చేసి.. ”చాలా రోజులు గడిచిన తర్వాత ఈ మదర్స్ డే రోజూ మా పాప ఇంటికొచ్చింది. వంద రోజులకుపైగా ఎన్‌ఐసీయు(నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌)లో గడిపిన తర్వాత ఎట్టకేలకు మా పాప మా ఇంట్లో అడుగుపెట్టింది. కుటుంబం అంటే ప్రత్యేకమైంది. కొన్ని నెలలుగా మా ప్రయాణం సవాలుగా సాగినా ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. కుటుంబంతో గడిపే ప్రతి క్షణం ఎంతో విలువైంది. మా పాప ఎన్నో ఒడిదుడుకులని దాటుకొని ఇంటికొచ్చిన వేళ చాలా సంతోషంగా ఉంది.”

Mahhi Vij : రేప్ చేస్తా అంటూ.. టీవీ నటికి పబ్లిక్‌గా బెదిరింపులు..

”లాస్‌ ఏంజిల్స్ లోని సెడార్‌ నినాయ్‌ ఆసుపత్రుల్లో మా పాప కోసం నిస్వార్థంగా పనిచేసిన ప్రతి డాక్టర్‌, నర్సు, స్పెషలిస్ట్ లకు నా ధన్యవాదాలు. మా పాపని తల్లి తండ్రులుగా మేము ఎంతగానో ప్రేమిస్తున్నాం. అలాగే నా జీవితంలో ఉన్న మా అమ్మకి, నన్ను బాగా చూసుకున్న వాళ్లందరికి నా మదర్స్ డే శుభాకాంక్షలు. అందరికంటే ముందు నన్ను తల్లిగా మార్చినందుకు నా భర్త నిక్ జోనస్ కి శుభాకాంక్షలు” అని ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)