Priyanka Chopra : RRR తమిళ సినిమా అంటూ ప్రియాంక చోప్రా కామెంట్స్.. ట్రోల్ చేస్తున్న తెలుగు నెటిజన్లు..

RRRని బాలీవుడ్ సినిమా అన్నందుకు గతంలో కూడా పలువురు తెలుగు నెటిజన్లు ఇది తెలుగు సినిమా అంటూ ట్రోల్ చేశారు. తాజాగా ప్రియాంక చోప్రా RRR సినిమాపై కామెంట్స్ చేసింది. ప్రియాంక చోప్రా ఓ ప్రముఖ........................

Priyanka Chopra : RRR తమిళ సినిమా అంటూ ప్రియాంక చోప్రా కామెంట్స్.. ట్రోల్ చేస్తున్న తెలుగు నెటిజన్లు..

Priyanka Chopra said RRR movie is a tamil movie and trolled by telugu netizens

Priyanka Chopra : RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకొని నాటు నాటు(Naatu Naatu) సాంగ్ తో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్(Oscar) సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే RRR సినిమాని ఇండియన్ సినిమా అనే ప్రమోట్ చేశారు. ఇండియాలో తెలుగు సినిమా అని పలు చోట్ల రాజమౌళి(Rajamouli) అండ్ టీం చెప్పారు. ఇన్నాళ్లు ఇండియా అంటే బాలీవుడ్(Bollywood) మాత్రమే అనుకునే వాళ్ళు అదే రీజన్ తో RRR సినిమాని కూడా మొదట బాలీవుడ్ సినిమా అనే హాలీవుడ్ లో కొంతమంది పలు చోట్ల వ్యాఖ్యానించారు.

అప్పుడే కొంతమందికి ఇది తెలుగు సినిమా, బాలీవుడ్ కాదు అని రాజమౌళి అండ్ టీం సమాధానాలు చెప్పారు. RRRని బాలీవుడ్ సినిమా అన్నందుకు గతంలో కూడా పలువురు తెలుగు నెటిజన్లు ఇది తెలుగు సినిమా అంటూ ట్రోల్ చేశారు. తాజాగా ప్రియాంక చోప్రా RRR సినిమాపై కామెంట్స్ చేసింది. ప్రియాంక చోప్రా ఓ ప్రముఖ హాలీవుడ్ పాడ్ కాస్ట్ లో ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో పలు ఆసక్తికర విషయాలని పంచుకుంది. బాలీవుడ్ లో నన్ను టార్గెట్ చేసి అవకాశాలు రాకుండా చేసింది అని చెప్పగా ఈ విషయంలో మాత్రం పలువురు ప్రియాంక కు సపోర్ట్ గా మాట్లాడారు.

Tu Jhoothi Main Makkaar : 200 కోట్లు కొల్లగొట్టిన రణబీర్.. బాలీవుడ్ కి ఇంకో పెద్ద హిట్..

ఇదే పాడ్ కాస్ట్ లో RRR సినిమా గురించి కూడా టాపిక్ రావడంతో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు RRR సినిమా బాలీవుడ్ ఫిలిం అని చెప్పగా ప్రియాంక కాదు అది తమిళ్ సినిమా అనుకుంట అని చెప్పింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో తెలుగు నెటిజన్లు, మీమర్లు ప్రియాంక చోప్రాని, ఆ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. RRR తెలుగు సినిమా, ఇండియన్ సినిమా అంటూ పోస్టులు చేస్తున్నారు. దీంతో ప్రియాంక చోప్రా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

View this post on Instagram

A post shared by Crazy Buff (@thecrazybuff)