Shootings: షూటింగ్స్ బంద్.. ఏయే సినిమాలపై ప్రభావం?

ఆగస్టు 1 నుండి సినిమా షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించడంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా షూటింగ్స్ బంద్ ఏయే సినిమాలపై ప్రభావం చూపుతుందో ఒకసారి చూద్దామా.

Shootings: షూటింగ్స్ బంద్.. ఏయే సినిమాలపై ప్రభావం?

Producers Guild Shootings Hold To Effect These Movies

Shootings: టాలీవుడ్‌కు చెందిన యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆగస్టు 1 నుండి సినిమా షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించడంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ సమస్య ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియదు కానీ.. దీని ప్రభావం మాత్రం చాలా సినిమాలపై పడబోతుందని పలువురు అంటున్నారు. మరి ఈ సినిమా షూటింగ్స్ బంద్ ఏయే సినిమాలపై ప్రభావం చూపుతుందో ఒకసారి చూద్దామా.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రెండు సినిమాలు ‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’లపై షూటింగ్స్ బంద్ తీవ్ర ప్రభావం చూపనుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాలు తెరకెక్కుతుండటంతో, ఇప్పుడు అర్ధాంతరంగా షూటింగ్ బంద్ చేస్తే, నిర్మాతలకు భారీ నష్టాలు రావడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలు గాడ్‌ఫాదర్, భోళాశంకర్, వాల్తేరు వీరయ్య లపై కూడా ఈ సినిమా షూటింగ్స్ బంద్ ప్రభావం గట్టిగానే పడనుంది. నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కూడా ఆగిపోనుంది.

Producers Guild: ఆగస్టు 1 నుండి షూటింగ్స్ బంద్.. అఫీషియల్‌గా ప్రకటించిన ప్రొడ్యూసర్స్ గిల్డ్

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న రెండు సినిమాలు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాతో పాటు, వంశీ పైడిపల్లి తమిళ హీరో విజయ్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలపై కూడా ఈ ఎఫెక్ట్ పడనుంది. అటు మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ ‘ఖుషీ’, కిరణ్ అబ్బవరం హీరోగా మోహన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతన్న సినిమా కూడా ఆగిపోనుంది. ఇక విజయ్ దేవరకొండ పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో వస్తున్న జనగణమన, నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘దసరా’.. రవితేజ ‘రావణాసుర’.. అల్లరి నరేష్ ‘మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా.. ఇలా దాదాపుగా చిన్నవి పెద్దవి కలిపి 30 సినిమాలు వరకు షూటింగ్స్ నిలిచిపోయే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అటు ఆగస్టులో స్టార్ట్ కాబోయే మహేష్ త్రివిక్రమ్ సినిమా.. అల్లు అర్జున్ సుకుమార్ సినిమా.. ఎన్టీఆర్ కొరటాల సినిమాలపై కూడా బంద్ ప్రభావం ఖచ్చితంగా పడనుంది.