Project K Making Video : న్యూ ఇయర్ స్పెషల్.. ప్రాజెక్ట్ K మేకింగ్ వీడియో వదిలిన టీం.. టైర్ తయారు చేయడానికి ఇంతా??

తాజాగా ప్రాజెక్ట్ K సినిమా నుంచి న్యూ ఇయర్ స్పెషల్ అంటూ ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఈవీడియోలో ప్రాజెక్ట్ K సినిమాలో వాడే స్పెషల్ వెహికల్స్ కి వాడే.........

Project K Making Video : న్యూ ఇయర్ స్పెషల్.. ప్రాజెక్ట్ K మేకింగ్ వీడియో వదిలిన టీం.. టైర్ తయారు చేయడానికి ఇంతా??

Project K Making Video released by movie unit

Project K Making Video :  మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్‌ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రాజెక్ట్ K సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు వైజయంతి మూవీస్. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమాను నాగ్ అశ్విన్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టి శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. కేవలం ఒక షెడ్యూల్ షూట్ అయింది అని, చేయి మాత్రమే కనిపించే ఓ రెండు పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ K గురించి ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకి కావాల్సిన వెహికల్స్ దొరకవు, సొంతంగా తయారు చేసుకోవాలని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దానికి తగ్గట్టే మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్రా సాయం అడగగా ఆయన ఓకే చెప్పడంతో సినిమా కోసం కొత్త తరహా వెహికల్స్ ని తయారు చేస్తున్నారు మహీంద్రా టీంతో కలిసి.

Naresh- Pavithra : ఇక అంతా అఫీషియల్.. లిప్ కిస్‌తో నరేష్-పవిత్రా పెళ్లి ప్రకటన..

తాజాగా ప్రాజెక్ట్ K సినిమా నుంచి న్యూ ఇయర్ స్పెషల్ అంటూ ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఈవీడియోలో ప్రాజెక్ట్ K సినిమాలో వాడే స్పెషల్ వెహికల్స్ కి వాడే ఓ సింగిల్ టైర్ మేకింగ్ వీడియో మాత్రమే చూపించారు. అలాగే ఆ టైర్ ని ఎలా తయారు చేశారు, టైర్ తయారు చేసే గ్యారేజ్ చూపించారు. ఎంతో ఆతృతగా వీడియో ఓపెన్ చేసిన అభిమానులు టైర్ తయారు చేయడం ఒక్కటి చూపించి మేకింగ్ వీడియో అంటారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి కొంతమంది ఒక్క టైర్ కే ఇంత కష్టపడి తయారు చేస్తున్నారంటే సినిమాని గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు.