Project K : ప్రాజెక్ట్ K సరికొత్త చరిత్ర.. ‘కామిక్ కాన్’కి వెళ్లనున్న ఫస్ట్ ఇండియన్ ఫిలింగా రికార్డ్.. ఆ రోజే గ్లింప్స్?

తాజాగా ఈ అంచనాలని పెంచుతూ చిత్రయూనిట్ మరో అప్డేట్ ఇచ్చింది. ప్రాజెక్ట్ K సినిమా కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది.

Project K : ప్రాజెక్ట్ K సరికొత్త చరిత్ర.. ‘కామిక్ కాన్’కి వెళ్లనున్న ఫస్ట్ ఇండియన్ ఫిలింగా రికార్డ్.. ఆ రోజే గ్లింప్స్?

Project K Movie Creates new history as first Indian film went to San Diego Comic Con

Project K : రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్(Nag Ahwin) దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ K. ప్రస్తుతం ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా అనేకమంది స్టార్స్, మరింతమంది స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ అంచనాలని పెంచుతూ చిత్రయూనిట్ మరో అప్డేట్ ఇచ్చింది. ప్రాజెక్ట్ K సినిమా కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది. అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో కామిక్ కాన్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి అనేకమంది సినిమా ప్రేమికులు, కామిక్ బుక్స్ అభిమానులు ఈ ఈవెంట్ కి విచ్చేస్తారు.

ఈ ఈవెంట్ లో ముఖ్యంగా కామిక్ బుక్స్ ని, సినిమాలను కూడా కామిక్స్ లాగా మార్చి ప్రదర్శిస్తారు. ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా నాలుగు లేదా అయిదు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం జులై 19 రాత్రి పార్టీతో ఈ ఈవెంట్ మొదలవుతుంది. జులై 23 వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ లో పాల్గొనటానికి లక్షకు పైగా ఆడియన్స్ రానున్నారు. జులై 20న ఈ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K టీంతో పాటు ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ పాల్గొననున్నారు. అదే రోజు ప్రాజెక్ట్ K సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

Salaar : కేజీఎఫ్‌తో సలార్‌కి కనెక్షన్.. వైరల్ అవుతున్న పోస్ట్.. నీల్ సినిమాటిక్ యూనివర్స్!

దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కామిక్ కాన్ లో పాల్గొనబోయే మొదటి ఇండియన్ సినిమా ప్రభాస్ ప్రాజెక్ట్ K కావడంతో ప్రభాస్ అభిమానులు సంతోషంతో చిత్రయూనిట్ కి అభినందనలు తెలుపుతున్నారు. అలాగే గ్లింప్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.