PUBG : గేమర్స్‌కు గుడ్ న్యూస్, పబ్ జీ గేమ్ వచ్చేసింది..కొత్తకొత్తగా!

పబ్ జీ’ న్యూ స్టేట్ పేరిట అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ గేమ్ 17 భాషల్లో డిజైన్ చేశారని సమాచారం.

Next-Generation India : పబ్ జీ గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గేమ్స్ ఆడే వారికి దీని గురించి తెలుసు. యుక్త వయస్సులో ఉన్న వారి దగ్గరి నుంచి చిన్న పిల్లల వరకు ఈ గేమ్స్ ఆడుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. పబ్ జీ ఇండియాలో ఓ రికార్డును క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. యూత్ మాత్రమే కాదు..మధ్య వయస్సు వాళ్లు కూడా ఈ గేమ్ కు ఫుల్ అడిక్ట్ అయ్యారు. కానీ..సడెన్ గా భారత ప్రభుత్వం చైనాకు చెందిన కొన్న యాప్స్ బ్యాన్ చేసింది. అందులో పబ్ జీ కూడా ఉంది. దీంతో గేమర్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.

Read More : T20 World Cup 2021: వాటే మ్యాచ్… పాకిస్తాన్‌‌పై సంచలన విజయంతో ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా

తాజాగా..‘పబ్ జీ’ న్యూ స్టేట్ పేరిట అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ గేమ్ 17 భాషల్లో డిజైన్ చేశారని సమాచారం. గూగుల్ ప్లే స్టోర్ లో దీని సైజ్ 1.4 GBఉండగా..ఆండ్రాయిడ్ 6 వర్షన్ లో మాత్రమే ఈ గేమ్ ఆడడానికి వీలు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆధునాతన ఆయుధాలతో ఈ గేమ్ రూపొందించినట్లు అంతేగాకుండా..ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తేవడం జరిగిందని పబ్ జీ సృష్టికర్త క్రాఫ్టన్ సంస్థ వెల్లడిస్తోంది.

Read More : Xi Jinping : చైనా జీవితకాల అధినేతగా జిన్‌పింగ్‌..! చారిత్రక తీర్మానానికి కమ్యూనిస్టు పార్టీ ఆమోదం

కోట్ల మంది భారతీయులు పబ్ జీ గేమ్ ఆడటానికి ఇష్టపడ్డారు. చైనా వివాదం నేపథ్యంలో పబ్ జీని భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీంతో కొన్ని సంవత్సరాల వరకు ఈ ఆటకు దూరమయ్యారు. ఇక్కడి యూజర్లను వదులుకోవడం ఇష్టం లేని క్రాఫ్టన్ సంస్థ…బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరిట ప్రత్యేకంగా దేశీయ గేమ్ ను రూపొందించడం విశేషం. మరి ఈ గేమ్ కు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు